Viral Video : సాధారణంగా చెవిలోకి చీమలు దూరడం సహజమే. చీమలు దూరినప్పుడు చెవిలో దురద పెడుతుంది. చెవిలోకి వెళ్లాక చీమలు చెవిలో చాలా సమస్యలు సృష్టిస్తాయి. చీమలే కాదు.. ఒక్కోసారి పురుగులు కూడా చెవిలోకి దూరుతుంటాయి. కానీ.. చెవిలోకి పాము దూరడం ఎప్పుడైనా చూశారా? చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా. చెవిలోకి పాము దూరడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా. కానీ.. ఇది అక్షరాలా నిజం. చెవిలోకి నిజంగానే ఓ పాము దూరింది. పాము దూరనైతే దూరింది కానీ.. ఆ చెవిలోకి వెళ్లాక పాము అటూ ఇటూ కదల్లేక నరకయాతన చూసింది. పాము దూరిన తర్వాత చెవి నొప్పితో ఆ యువతి కూడా చుక్కలు చూసింది.

పాము చెవిలో దూరితే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు కదా. చెవి రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది. దానిలోకి పాము దూరి పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ యువతి చెవిలోకి పాము దూరడంతో వెంటనే హాస్పిటల్ కు పరిగెత్తింది. ఆ యువతి సమస్య విని డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. వెంటనే మెడికల్ టాంక్స్ సాయంతో పామును చెవి నుంచి బయటకు తీశారు డాక్టర్లు. చెవిలో దూరినా కూడా ఆ పాము బతికే ఉండటం గమనార్హం.
Viral Video : సోషల్ మీడియాలో వీడియో వైరల్
డాక్టర్లు తన చెవిలో నుంచి పామును తీస్తుండగా వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పాము తల చెవి బయట కనిపిస్తోంది. పాము తలను మెడికల్ పరికరాలతో డాక్టర్లు పట్టుకోవడంతో ఆ పాము తన తలను అటూ ఇటూ ఆడించింది. ఆ తర్వాత నెమ్మదిగా పామును ఆ యువతి చెవిలో నుంచి తీసి.. ఆ యువతి ప్రాణాలను కాపాడారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. చెవిలోకి పాము దూరడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.