Rajamouli : జూనియర్ ఎన్టీఆర్ ఆయన నటన తో ఎంతో క్రేజ్ అందుకున్న హీరో తన డాన్స్ గురించి పర్సనల్గా తెలియజేయాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న తీసిన త్రిబుల్ ఆర్ మూవీ లో తననాటనతో అందర్నీ మెస్మరైజ్ చేసేసాడు. ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ల తాత అవతారంలో వచ్చాడు అని చెప్పవచ్చు. యంగ్ టైగర్ లో గొప్ప కలలు ఉన్నాయని అతన్ని దగ్గర నుండి చూసినవారికి మాత్రమే తెలిసిద్ది. ఆయన కళ్ళల్లో ఉండే కల ఆ ప్రతిభ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేశాడు. బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర మూవీను రాజమౌళి ఇండియాలో నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు రాజమౌళి.
Rajamouli : యంగ్ టైగర్ మల్టీ టాలెంట్ కి ఎంతటి వారైనా పడిపోవాల్సిందే…
ప్రమోషన్ వేడుకలలో జాయిన్ అయితు తన మూవీల లెవెల్స్ లో బ్రహ్మాస్త్ర మూవీకి ప్రమోషన్ చేస్తూ… తనదైన శైలిలో మూవీకి హైప్ తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. దాని సందర్భంగా లేటెస్ట్ గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడుతూ… యంగ్ టైగర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ యంగ్ టైగర్ యొక్క.. మెమొరీ పవర్ గురించి చెప్పాడు. ఎన్టీఆర్ కి ఏదైనా నచ్చితే దాన్ని ఎంతో బాగా గుర్తుంచుకుంటాడో అనేందుకు ఇది సాక్ష్యం.

రాజమౌళి చేసిన ఆసక్తికర వ్యాఖ్య ఏమిటంటే… త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషనల్ ఎపిసోడ్లో ముంబైలో ఉన్న టైంలో రన్బీర్ కపూర్ ని మీట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో రన్బీర్ కపూర్ చేసిన రాక్ స్టార్ సాంగ్స్ ను ఎన్టీఆర్ ప్లే చేయాల్సిందిగా అడిగాడు. ఆ టైంలో రణబీర్ ఆ పాటలను ప్లే చేయించాడు. రాక్ స్టార్ లో చేసిన రనబీర్ కపూర్ ఆయన ఆ సాంగ్స్ యొక్క లిరిక్స్ ని గుర్తు లేకపోవచ్చేమో కానీ. యంగ్ టైగర్ మాత్రం ప్రతి లైన్ యొక్క పొల్లు పోకుండా అక్కడ ఉన్న వారందరినీ అవాక్ చేశాడు. ఆయనకి ఏదన్నా నచ్చితే ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా గుర్తుంచుకుంటాడో ఆ విషయాన్ని మేము అందరం చూసి తెగ మురిసిపోయాం అంటూ రాజమౌళి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.