Viral Video : మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా బంధాలు, అనుబంధాలు ఉంటాయి. వాటికీ ప్రేమానురాగాలు ఉంటాయి. అవి కూడా అన్యోన్యంగా జీవిస్తాయి. దానికి ఉదాహరణే ఈ వీడియో. నిజానికి మనుషులు మాట్లాడగలరు కానీ.. జంతువులు మాట్లాడలేవు. అందుకే వాటి ప్రేమను చెప్పలేవు కావు.. ఎదుటి జంతువు మీద చూపించగలవు. వాటి మధ్య కూడా గొడవలు అవుతుంటాయి. బుజ్జగింపులు ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అది రెండు పులుల మధ్య జరిగిన చిలిపి ఘటన. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరైనా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తే ఏమౌతుంది. నా నిద్రనే డిస్టర్బ్ చేస్తావా అంటూ వాళ్లు మన మీద అరుస్తారు. నిద్ర ఎవరికైనా నిద్రే కదా. ఎవరి నిద్రను అయినా అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్లను లేపొద్దు. జంతువులు కూడా అంతే. ఎందుకంటే ఈ సృష్టిలోని ఏ ప్రాణి అయినా ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. నిద్ర లేకుంటే మనిషి అయితే ఒక్క రోజూ కుడా ఉండలేడు.
Viral Video : మగ పులిపైనే తన ప్రతాపం చూపించిన ఆడ పులి
ఐర్లాండ్ లోని డబ్లిన్ అనే జూలో జరిగిన ఘటన ఇది. 2016 లో జరిగింది. కానీ.. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఆ వీడియోకు 14.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 6 లక్షల లైక్స్ వచ్చాయి. ఓ కొలనులో నీళ్లు తాగిన మగ పులి.. అక్కడే నిద్రిస్తున్న ఆడ పులి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి ఆ ఆడ పులి నిద్రపోతుండగా దాన్ని లేపే ప్రయత్నం చేస్తుంది. ఇక అంతే. నా నిద్రనే డిస్టర్బ్ చేస్తావా అంటూ ఆ ఆడపులి మగపులి మీద విరుచుకుపడింది. దీంతో వెంటనే ఆ మగపులి అక్కడి నుంచి భయపడి సైలెంట్ గా వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో.. ఆడపులి మామూల్ది కాదు.. రచ్చ రచ్చ చేసిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Her: wake me up in an hour pls
Me: *wakes her up in an hour*
Her: pic.twitter.com/4SQpsyRPbO
— Lance ???????? (@BornAKang) September 19, 2022