Keerti Suresh : సినీ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ నే ఉంది. హీరో రామ్ నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఈ సినిమా హిట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషలలో కూడా హీరోయిన్ గా నటిస్తూ మంచి ఫామ్ లో ఉంది కీర్తి సురేష్. గత మూడేళ్లుగా హిట్స్ లేకపోయినా కీర్తి కి మాత్రం హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. కథ నచ్చితే రజినీకాంత్, చిరంజీవి లాంటి వారికి సిస్టర్ గా నటించడానికి కూడా ఓకే చేస్తుంది. మహానటి సినిమా తెచ్చిన క్రేజ్ కీర్తికి ఓ పదేళ్లపాటు మైలేజ్ ని తెచ్చి పెట్టింది.
నేషనల్ అవార్డు విన్నర్ నరేష్ కుకునూర్ లాంటి డైరెక్టర్ సినిమాలు చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. తమిళంలో రజినీకాంత్ కి చెల్లిగా నటించిన అణ్ణాత్త సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో నితిన్ సరసన చేసిన రంగదే, మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలు యావరేజ్ హిట్ సాధించాయి. వీటిలో సర్కార్ వారి పాట కీర్తికి మంచి పేరుని తెచ్చిపెట్టింది.
Keerti Suresh : ఇందులో నిజమెంత…
అయితే తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ కు జోడిగా కీర్తి సురేష్ రెండు సినిమాలలో నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరిందంట. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. శివ కార్తికేయన్, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. కేవలం శివ కార్తికేయన్ తో మాత్రమే కాదు బిజినెస్ మెన్ తో కీర్తికి పెళ్లైనట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ గాసిప్స్ అని చాలాసార్లు కీర్తి క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా తన క్రేజ్ వల్ల అలాంటి వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.