Viral Video : ఒక చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. చెట్టు మనుషులు వదిలే కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతాయి. మనుషులు పీల్చుకునే ఆక్సిజన్ చెట్లు వదిలేవే.. ఈ ప్రపంచంలో చెట్లు అనేవే లేకపోతే మనిషి రోజూ ఆక్సిజన్ ను కొనుక్కొని పీల్చుకోవాలి. అందుకే.. చెట్లను నాటాలి.. చెట్లను పెంచాలి అని ప్రభుత్వాలు నెత్తినోరు మొత్తుకుంటున్నా కూడా మనం చెట్లను పెంచడం కాదు.. ఉన్న చెట్లను నరికేస్తున్నాం. కూల్చేస్తున్నాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అంటారు. ఈ భయానక వీడియోను చూసి నెటిజన్లే షాక్ అవుతున్నారు. నోరెళ్లబెడుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా ఇలా కూడా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.

వందల ఏళ్ల నాటి చెట్టు అది. ఆ చెట్టు మీద కొన్ని వందల పక్షులు గూడు కట్టుకొని నివాసం ఉంటున్నాయి. పిల్లలను పొదుగుతున్నాయి. కానీ.. పాలకులకు అవేమీ పట్టలేదు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ హైవే 66 మీద ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేను వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును కూల్చేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. కానీ.. ఆ చెట్టు మీద హెరోన్రీ అనే జాతికి చెందిన కొంగలు నివాసం ఉంటున్నాయి. అవి ఇదే సీజన్ లో గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఈ సమయంలో చెట్టును కూల్చేస్తే అప్పుడే పుట్టిన పిల్లలు అన్నీ చనిపోతాయి. వాటికి రెక్కలు ఉండవు కాబట్టి అవి ఎగరలేవు కాబట్టి చెట్టును కూల్చేస్తే అవన్నీ చనిపోతాయని తెలిసి కూడా ఆ చెట్టును నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు.
Viral Video : భగ్గుమంటున్న నెటిజన్లు
ఒక్కసారిగా వందల ఏళ్ల నాటి ఆ చెట్టును కూల్చేయడంతో వందల సంఖ్యలో కొంగలు మృత్యువాత పడ్డాయి. అవి పొదిగిన పిల్లలు కూడా చనిపోయాయి. చెట్టు భూమి మీద పడటంతో పిల్లలు ఎగరలేక.. భూమిని తాకి చనిపోయాయి. కొన్ని చెట్ల కొమ్మల మధ్యలో చిక్కుకొని చనిపోయాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఆ చెట్టును నరికేసిన అధికారుల మీద విరుచుకుపడుతున్నారు. పక్షులు అంటే అంత చిన్నచూపా. పక్షులు ఏం పాపం చేశాయి. వాటి ఉసురు తగలకుండా ఉంటుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022