Fenugreek Health Benefits : ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో మెంతులను ఔషధంగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరి వంటగదిలో మెంతులు తప్పకుండా ఉంటాయి. రోజు మనం తీసుకునే ఆహారంలో మెంతులను ఉపయోగిస్తాము. ఎక్కువగా మనం మెంతులను పోపుల్లోనూ, చారు, పులుసు దోషల్లోనే వాడుతాం. మెంతు పొడిని పచ్చడి తయారీలో ఉపయోగిస్తాం. ఇవి టేస్ట్ కలగజేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో పోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం ,కాలుష్యం ,ఐరన్ మంగనేష్ తో పాటు విటమిన్ ఏ, బి, సి ,బి కే వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
ఈ గింజలు డయాబెటిస్, పీరియడ్ క్రాంప్స్, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తాయి. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులు ను బాగా ఉపయోగిస్తున్నారు. మెంతులు ని నానబెట్టి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మీరు యాసిడిటీ, కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటే మెంతులు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. నానబెట్టిన మెంతులను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు. మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. రోజు మెంతులు తింటే మలబద్ధక సమస్యలు కూడా దూరమవుతాయి.
Fenugreek Health Benefits : నానబెట్టిన మెంతులను తీసుకుంటే మన శరీరానికి ఎన్ని లాభాలో..

రక్తంలోనే చక్కెర స్థాయిలను మెంతులు నియంతరించడంలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట మెంతులు నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నీటితో పాటు తీసుకుంటే మంచిది. మొలకెత్తిన మెంతులు తీసుకుంటే ఇంకా చాలా మంచిది. మెంతుల్లో 30 _40 శాతం ఎక్కువ పోషక గుణాలు ఉంటాయి. మెంతులు జీర్ణక్రియను పిండి పదార్థాలను గ్రహించుకోవడానికి నెమ్మది చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. మెంతుల్లో నాలుగు హైడ్రాక్సిస్ లూసిన్ అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి కణాల ఇన్సులిన్ ని తీసుకునేలా చేస్తుంది. మెంతులు శరీరంలో వేడిని కలగజేస్తాయి. కాబట్టి కపం సమస్యలతో బాధపడేవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది. అలాగే దగ్గును నయం చేయడంలో మెంతులు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఆస్తమా, దగ్గు ఊపిరతిత్తుల్లో ద్రవాలు స్లేష్మం, గడ్డ కట్టడం, కప వ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. మెంతుల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు మెంతులను నానబెట్టి ఖాళీ కడుపుతో తీసుకుంటే మేలు కలుగుతుంది