Viral Video : లైవ్ కు అడ్డొచ్చిందని ఈగను ఈ టీవీ యాంకర్ ఏం చేసిందో తెలిస్తే నవ్వాపుకోలేరు

Viral Video : టీవీ యాంకర్స్, రిపోర్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అటెన్షన్ తో ఉండాలి. అప్పుడే వాళ్లు చెప్పే వార్తలు సరిగ్గా చెబుతారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది వాళ్ల రిపోర్టింగ్ ను, యాంకరింగ్ ను చూస్తుంటారు. అందుకే ఎంతో జాగ్రత్తగా ఎటువంటి అడ్డంకులు లేకుండా వార్తలు చదవాల్సి ఉంటుంది. అయితే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఏవో కొన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అలా లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా లైవ్ లో వార్తలు చదువుతుండగా చాలామందికి అడ్డంకులు వచ్చి లైవ్ ఆగిపోయిన చాలా వీడియోలను మనం ఇప్పటి వరకు చూశాం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది.

Advertisement
tv anchor swallows fly on tv live video viral
tv anchor swallows fly on tv live video viral

ఓ యాంకర్ లైవ్ లో వార్తలు చదువుతుండగా తనకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. తనకి వచ్చిన అడ్డంకిని తొలగించుకొని తను వార్తలు చదవాలని ఎంతో ప్రయత్నించింది. కానీ.. తనకు కుదరలేదు. వార్తలు చదవడం మధ్యలో ఆపేస్తే లైవ్ ఆగిపోతుంది కాబట్టి ఎలాగైనా లైవ్ ఆగకుండా ఉండేందుకు ఆ యాంకర్ ఏం చేసిందో తెలిస్తే మీరు మాత్రం అవాక్కవుతారు.

Advertisement

Viral Video :  లైవ్ లో తనను చాలా డిస్టర్బ్ చేసిన ఈగ

ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. లైవ్ టీవీ అనే చానెల్ లో లైవ్ న్యూస్ వస్తోంది. గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజర్ అనే మహిళ లైవ్ బులిటెన్ చదువుతోంది. పాకిస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల గురించి తను మాట్లాడుతోంది. తను పాకిస్థాన్ వరదల గురించి చెబుతుండగానే ఇంతలో ఓ ఈగ వచ్చి తన చుట్టూ తిరుగుతోంది. గుయ్ అంటూ సౌండ్ చేస్తూ తనను డిస్టర్బ్ చేస్తోంది. దీంతో ఆ యాంకర్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలే లైవ్ న్యూస్.. మధ్యలో లైవ్ న్యూస్ ను ఆపడం కుదరదు. దీంతో వెంటనే ఆ యాంకర్ ఆ ఈగను గుటుక్కుమన మింగేసింది. ఈగను మింగిన తర్వాత గొంతు సవరించుకొని మరీ మళ్లీ ఫరా వార్తలు చదివేసింది. మనం నువ్వుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే నేను ఓ ఈగను లైవ్ లో మింగేశా.. అంటూ ఆ వీడియోను షేర్ చేసింది ఫరా. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Advertisement