Viral Video : సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అందులో కొన్నే వైరల్ అవుతుంటాయి. అన్ని వీడియోలు వైరల్ కావు కదా. కొన్ని వీడియోలే వైరల్ అవుతాయి. అందులోనూ కంటెంట్ ఉండాలి. లేకపోతే ఆ వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకోవు. ప్రస్తుతం అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియోలో ఏముంది.. ఆ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది అనే విషయం నెటిజన్లకే తెలియాలి. మొత్తానికి ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయినట్టుగానే మీరు కూడా షాక్ అవుతారు. అంతకంటే ఎక్కువగా అవాక్కవుతారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎక్కడైనా రోడ్డు పక్కన పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదా. అవి రోడ్డు కింది నుంచి తీస్తారు. రోడ్డు మీద నడిచేలా ఉండేందుకు ఐరన్ తో చేసిన కమ్మీలను ఏర్పాటు చేస్తుంటారు. ఆ కమ్మీల నుంచి ఏదైనా కిందపడితే తీయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ కమ్మీలలో చేతులు పట్టవు. ఫోన్ లాంటి వస్తువులు కూడా ఒక్కోసారి అందులో పడిపోతుంటాయి. తాజాగా అదే జరిగింది. ఓ వ్యక్తి ఎయిర్ పాడ్ అందులో పడిపోయింది. దీంతో ఏం చేయాలో ఆ పెద్దాయనకు అర్థం కాలేదు.
Viral Video : చేతి దాకా వచ్చి నోటి దాకా రాని ఎయిర్ పాడ్
ఎయిర్ పాడ్ ను ఆ వ్యక్తి ఓ తీగ సాయంతో బయటకు తీసుకొస్తాడు. బయటి దాకా వచ్చినట్టే వచ్చి చేతుల్లోకి తీసుకునేలోపే మళ్లీ అందులో పడిపోయింది. దీంతో ఆ వ్యక్తి అయ్యో అంటాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు. నవ్వలేక చచ్చిపోతున్నారు. వామ్మో వేలకు వేలు పెట్టి ఇయర్ బడ్స్ కొంటే అవి ఇలా అందులో పడిపోతే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.