Wild Animals : తోడేళ్ల వ్యూహం…తిప్పి కొట్టిన కుందేలు…వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే…

Wild Animals : ఒక జీవికి ఆకలి వేసిందా మరో జీవికి అహుసు మూడిందే..దాకో దాక్కో మేక పులి వచ్చి కొరికిది పీక…ఏంటి పుష్ప పాట అనుకుంటున్నారా..అదేనండి అడవిలో ప్రతి జంతువు పాటించే నియమం. అడవిలో జీవించే జంతువుల లో కొన్ని శాఖాహారులు కొన్ని మాంసాహారాలు ఉంటాయి. ఇక మాంసాహార జంతువులు శాఖాహార జంతువుల వెంటపడి తినేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఎరగా ఉండే జంతువు దొరక్కుండా పరిగెడితే ఆహారకోసం వెంపర్లాడే క్రూర జంతువులు వాటిని వెంబడిస్తుంటాయి. ఈ నియమాన్ని పాటించకపోతే అడవిలో జంతువుల మనుగడ సాగదు. ఈ క్రమంలోనే సింహాలు, పులులు వాటి వ్యూహాలను ఉపయోగించి మరి జింకలను, ఎద్దులను పట్టి చంపేస్తుంటాయి.

Advertisement

 wolves-strategy-turned-rabbit-watch-the-video-and-you-will-be-surprised

Advertisement

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాకాహార జంతువుకి ప్రాణహాని అనేది ఉంటుంది. అయితే క్రూర జంతువులలో తోడేళ్లు అద్భుతమైన వేట కలలు కలిగి ఉంటాయి. ఇవి ఎప్పుడు గుంపులు గుంపులుగా వేటాడుతూ అద్భుతమైన వ్యూహాలతో వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అయితే అలాంటి తోడేళ్ల వ్యూహాలని ఒక కుందేలు తిప్పి కొట్టింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఆ వీడియోలో ఒక పెద్ద కుందేలును పట్టుకునేందుకు విశాలమైన పొలంలో రెండు పెద్ద తోడేళ్లు దాని వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో తోడేళ్ల నోటికి చిక్కకుండా కుందేలు చాలా వేగంగా పరిగెడుతూ వాటిని ముప్పు తిప్పలు పెట్టింది. తోడేళ్లలో ఒక్కటైనా కుందేలు తోక పట్టి లాగితే దాని పని అక్కడే అయిపోయిండేది . కానీ అక్కడ అలా జరగలేదు.

 wolves-strategy-turned-rabbit-watch-the-video-and-you-will-be-surprised

ఆ కుందేలు సెకండ్ల వ్యవధిలోనే దాని దిశను మార్చుకుంటూ రెండు తోడేళ్లకు చిక్కకుండా పరుగులు పెట్టించింది. వాటంత అవి ఆగేంతవరకు తోడేళ్లను కుందేల ముప్పు తిప్పలు పెట్టింది. అనంతరం ఆయాస పడిపోయిన తోడేళ్లు కాస్త ఆగడం తో ఒక్కసారిగా కుందేలు శరవేగంగా పరిగెత్తి వాటికి దూరంగా పారిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ గా వాట్ ఇస్ లైఫ్…నెవర్ గివ్ అప్ అంటూ రాస్కొచ్చారు. అయితే నేటి కాలంలో చాలామంది చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఆలోచించే వారికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ వీడియో అని చెప్పాలి . లైఫ్ లో కష్టాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి…మనకోసం మనం గట్టిగా నిలబడినప్పుడే కుందేలు లాగా మనం కూడా జీవితంలో గెలవగలుగుతాం. ఈ ఒక్క వీడియోలో ఇంత అర్థం దాగి ఉంది. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.

Advertisement