Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం అందరికీ తెలుస్తుంది. అయితే తాజాగా వింత వింత ప్రదేశాలలో విష సర్పాలు కనబడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని సంబంధించిన వీడియోలను ఎప్పటికీ మనం చాలానే చూసాం. బైక్ లలో ,ఇంటి సీలింగ్ లో , మంచాలలో నుండి పాములు బుసలు కొడుతూ రావడాన్ని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటిదే మరొక ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఒక కారు ఇంజన్ లో కొండచిలువ ఇరుక్కుపోయింది. దాదాపు ఆరడుగుల పొడవున్న ఈ కొండచిలువ కారు ఇంజన్ లోకిి దూరింది.
ఇక ఇది గమనించిన ఓనర్ స్నేక్ క్యాచర్లకు విషయం తెలియజేయగా సుమారు గంటన్నర పాటు కష్టపడి స్నేక్ క్యాచెర్స్ దానిని సురక్షితంగా బయటికి తీశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ సమీపంలో చోటుచేసుకుంది. చిత్రంజన్ పార్కు ప్రహరీ గోడకు సమీపంలో పార్కు చేసి ఉన్న కారులోకి దాదాపు ఆరడుగుల కొండచిలువ దూరింది.అలా అది ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కుపోయింది. ఇక ఎక్కడికి కదలలేక అలాగే అక్కడే ఉండిపోయింది.
అయితే కార్ ఓనర్ కార్ ని స్టార్ట్ చేయాలని కార్ వద్దకు రాగా అతనికి లోపల ఏదో ఉన్నట్లుగా అనుమానం కలిగింది. ఇక కారు డోర్ పైకి లేపి చూడగా కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ బృందానికి సమాచారం అందించాడు. ఇక ఈ సమాచారం అందుకున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకొని ప్రాణాలతో కొండ చిలువని బయటకు తీశారు. ఇక ఆ కొండచిలువను అడవి శాఖ అధికారులకు అందజేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram