Winter : చలికాలంలో చన్నీటి స్నానం మంచిదా లేక వేడి నీటి స్నానం మంచిదా ..??

Winter : చల్లగా ఉండే చలికాలంలో చర్మ పరంగా, ఆరోగ్యకరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంతమంది చన్నీటితో స్నానం చేస్తారు మరికొంతమంది వేడి నీటితో స్నానం చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకడంతోపాటు చిరాకు పోయి, మనసు హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా లేక వేడి నీటి స్నానం మంచిదా అని చాలామందిలో కలిగే డౌటు. చలికాలంలో చన్నీటితో స్నానం చేయడం వలన బాడీలో వాతవ అనేది పెరుగుతుంది. దీని వలన కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, చర్మం పొడిబారటం, బలహీనమైన జీవ క్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి.

is-rain-bath-better-or-hot-water-bath-better-in-winter

అంతేకాకుండా చన్నీటితో స్నానం చేయటం వలన శరీర నొప్పులు అనేవి తగ్గవు. అయితే ఒకవేళ క్రమం తప్పకుండా రోజు చన్నీటితో స్నానం చేసేవారు చలికాలంలో కూడా చన్నీటితో స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి భంగం కలిగించదు. అంతేకాకుండా చన్నీటి స్నానం చేయడం వలన రక్తప్రసరణ పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు అధిక శాతం, జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక చలికాలంలో వేడి నీటితో స్నానం శరీరవాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు, శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా వేడి నీళ్లతో చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వలన జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి తీవ్రత కూడా తగ్గుతుంది.

is-rain-bath-better-or-hot-water-bath-better-in-winter

ఆయుర్వేద ప్రకారం చన్నీటి స్నానం చేయడం వలన శరీరంలో వాతం పెరగడమే కాకుండా చలి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వేడిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. చలికాలంలో బాహ్య ప్రపంచం చల్లగా ఉంటుంది. శరీరం లోపల వాతావరణాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వేడినీటి స్నానం చేయడం వలన చలి తగ్గడమే కాకుండా ఒత్తిడి, కండరాల నొప్పులు, సీజనల్గా వచ్చే వ్యాధులు కూడా దూరం అవుతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు.