Telangana : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వానలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు వాగులు నిండి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణలో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రకటించిన మూడు రోజుల సెలవులు ఈ రోజు తో ముగియడంతో రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవలసి ఉండగా ఈ సెలవులతో మరో మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం సెలవులుగా ప్రకటించింది.
Telangana : మరో మూడు రోజుల స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం.

దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం వలన ఈ అల్పపీడనం తీవ్రంగా బలపడి ఒరిస్సా మరియు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఉపరితల వార్తను దానికి అనుబంధంగా ఉన్న అల్పపీడనంకి సముద్రం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరు నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీనితో ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ముసురు లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది.