Bigg boss Himaja : స్టార్ హీరోయిన్ల దగ్గర్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు యూట్యూబ్ చానెల్ ను మెయిన్ టెన్ చేస్తున్నారు. అదో పార్ట్ టైమ్ లా అన్నమాట. తమ రెగ్యులర్ షూటింగ్స్ లేనప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటారు. దాని నుంచి అంతో ఇంతో ఇన్ కమ్ వస్తుంది కాబట్టి కొందరు అయితే రెగ్యులర్ గా యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో షేర్ చేస్తూనే ఉంటారు.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి హిమజ.. తన హోమ్ టూర్ వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తను ఇటీవల రెంట్ హౌస్ కు షిఫ్ట్ అయింది.
Bigg boss Himaja : హైదరాబాద్ లో ఉంటున్న హిమజ
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న హిమజ ఇటీవల రెంట్ హౌస్ కు షిఫ్ట్ అయింది. తన సొంతిల్లు నిర్మాణంలో ఉండటంతో అది పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనుందట. ఇక.. హోమ్ టూర్ లో హిమజను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. ఏంటి హిమజ ఇంత బొద్దుగా మారావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదివరకు హిమజ చాలా ఫిట్ గా ఉండేది. ఈ మధ్య కాస్త బొద్దుగా అయినట్టుంది. ముఖం కూడా ఉబ్బింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో తనపై కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా సెలబ్రిటీలకు ట్రోల్స్ కామనే. అవన్నీ హిమజ పట్టించుకోదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయినప్పటికీ.. తన హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.