Anil Ravipudi : బాలయ్య సినిమాలో బాలీవుడ్ హీరోయిన్… ఇలా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి…

Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2015 లో ‘ పటాస్ ‘ సినిమాతో వెండితెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన ‘ ఎఫ్3 ‘ సినిమా మంచి టాక్ ని తెచ్చుకుంది. ఇక బాలయ్య విషయానికొస్తే ఈ మధ్యనే ‘ అఖండ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నారు. తను నెక్స్ట్ ప్రాజెక్టును గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు.

ఈ సినిమా కంప్లీట్ అవగానే అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేయనున్నారు. అంతేకాకుండా హోస్ట్ గా ‘ అన్ స్టాపబుల్ సీజన్ 2 ‘ను కూడా చేయబోతున్నారు. ఈ షో గురించి ఆగస్టు 15న అప్డేట్ ఇవ్వనున్నారు. అనిల్ రావిపూడి ‘ ఎఫ్3 ‘ సినిమా సక్సెస్ తర్వాత బాలయ్య బాబుతో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈమెకు అంతగా అవకాశాలు లేవు. ఈమె దక్షిణాదిలో రజినీకాంత్ ‘ లింగ ‘ సినిమాలో నటించింది.

Anil Ravipudi : ఇలా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి…

Bollywood heroin Sonakshi Sinha act in balakrishna movie
Bollywood heroin Sonakshi Sinha act in balakrishna movie

మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ముందుగా తమన్నా, మెహ్రిన్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. తాజాగా సోనాక్షి పేరు వచ్చి చేరింది. ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్లు అనిల్ రావిపూడి ఖరారు చేశారు. అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో తీయబోయే ఈ సినిమా తండ్రి, కూతుర్ల మధ్య కథ ఉంటుందని తెలిపారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురిగా ‘ పెళ్లి సందడి ‘ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని అనిల్ తెలిపారు. శ్రీలీల అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని, ఆమె మాత్రం మీ ఈ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 107 ‘ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.