Vastu Tips for Bed Room : కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా జీవితం పై ప్రభావం చూపుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి స్థలం, జీవితం ఆనందమయం అవ్వడానికి వాస్తు ఉపకరిస్తుంది. అందుకే ఇంట్లో ప్రతి ది వాస్తు ప్రకారం అమర్చుకోవాలని వాస్తు నిపుణులు చూసిస్తారు. లేదంటే సమస్యల మధ్య ఇరుక్కుపోతారని అంటున్నారు వాస్తనిపుణులు. అయితే గృహములో అతి ముఖ్యమైన ప్రదేశాలలో బెడ్ రూమ్ ఒకటి. అందుకే బెడ్ రూమ్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు బెడ్ రూమ్ డిజైన్ చేయడం ద్వారా మీ ఇంటిని పునరుద్ధరించడమే కాకుండా, జీవితంలో వివిధ రకాల సానుకూల మార్పులు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ ఎలా అమర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పడుకోవడానికి దక్షిణ దిశ అనుకూలంగా పరిగణింపబడింది. అంటే పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు. కాళ్లు ఉత్తరం వైపు పెట్టాలి. పడక గదిలో బెడ్ ఏ ప్లేస్ లో ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. ఇది కుటుంబంలో అందరి ఆరోగ్య, నిద్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో హాల్ గదిలో మంచం తల పడమర వైపు ఉంచాలి. మీ బెడ్ చెక్కతో చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇనుముతో చేసినట్లయితే… జీవితంలో ప్రతికూల ప్రభావం చోటు చేసుకుంటుంది. అందుకే ఇనం ఇనప మంచం మీద పడుకోవద్దు. గది మూలల్లో మంచం ఉంచడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. వాస్తు ప్రకారం. బెడ్ గోడ మధ్యలో ఖాళీ స్థలం ఉంచాలి. బెడ్ చుట్టూ తిరగడానికి తగినంత స్థలం ఉంచాలి.
Vastu Tips for Bed Room : మీ పడక గదిలో ఈ వస్తువులు ఉన్నట్లయితే….. వెంటనే తీసేయండి.

మంచం ఎప్పుడూ దీర్ఘ చతుర సహకారంగా, చతురస్రాకారంలో ఉండాలి. గుండ్రంగా ఉన్న బెడ్ ని ఉపయోగించవద్దు. వాస్తు ప్రకారం, డబల్ కాట్ బెడ్ లో రెండు సింగిల్ పరుపులు వేరువేరుగా ఒకే పరుపులాగా ఉండేలా అమర్చుకోవాలి. భార్యాభర్తలు 2 పరుపులు పై కాకుండా ఒకే పరుపుపై నిద్రించాలి. సంతోషకరమైన బంధం కోసం ఎల్లప్పుడూ భార్య భర్త ఎడమ వైపున పడుకోవాలి. అదేవిధంగా గదిలో ఒంటరిగా ఉన్న జంతువులు ,పక్షులు వంటి ఫోటోలను ఉంచకూడదు.జంటగా ఉన్న జంతువులు ఫోటోలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో రాక్షసుడు ,గుడ్లగూబ ,గద్ద,చిత్రాలు పెట్టుకోవద్దు. వీటికి బదులుగా జింక ,హంస, చిలుక ఫోటోలను డెకరేషన్ గా పెట్టుకోవచ్చు.కుటుంబ సభ్యుల ఫోటోలను గదిలో పెట్టవచ్చు. స్రీ గర్భవతిగా ఉన్నప్పుడు భార్యాభర్త ఆగ్నేయ ముఖంగా ఉన్న బెడ్ రూమ్ లో ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరించారు.