Ravi Teja : రవితేజ గురించి వచ్చిన ఆ న్యూస్ ఫేక్… అసలు విషయం ఇదట.

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా శుక్రవారం రోజు అభిమానుల ముందుకి తీసుకువచ్చారు. అయితే ఈ మూవీ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో మూవీకి అత్యంత దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఎంతో దారుణమైన వసూళ్లు అందుకుంటున్న క్రమంలో మన మాస్ మహారాజా రవితేజ తన పారితోషకాన్ని మళ్లీ తిరిగి ఇచ్చేశాడు. అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇంకొక ఆశ్చర్యానికి గురిచేసి న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదేమిటంటే.. క్రాక్ మూవీ తో స్టార్ హిట్ ను దక్కించుకున్న మన హీరో రీఎంట్రీ ఇచ్చిన రవితేజ కిలాడి మూవీతో ఇంకొకసారి అభిమానుల ముందుకి వచ్చి దారుణమైన అపజయాన్ని అందుకోవాల్సి వచ్చింది.

రామారావు ఆన్ డ్యూటీ తో ఇంకొకసారి మ్యూజిక్ చేయడానికి ప్రయత్నించి పరాజయం మూటగట్టుకున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో నిర్వహించిన ఈ మూవీ పోయిన శుక్రవారం అభిమానుల ముందుకి వచ్చినట్లు అందరికీ తెలిసిందే. అలాగే ఈ మూవీ అభిమానులను ఆకట్టుకోవడంలో తీవ్రంగా విఫలమయింది. అయితే ఈ మూవీలో రవితేజ తో జంటగా దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్ లు నటులుగా చేశారు. ఈ మూవీలో రవితేజ ఒక డిప్యూటీ కలెక్టర్ రోల్ చేశారు. ఈ మూవీ టోటల్ గా ఎర్రచందనం, స్మగ్లింగ్, స్మగ్లర్ల తప్పిపోవడం నేపథ్యంలోనే తిరిగింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అనుకున్న మూవీ అస్సలు కొద్దిగా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఈ మూవీకి ఇచ్చిన పారితోషికం రవితేజ మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు అంటూ ప్రచారం వచ్చింది.

Ravi Teja : రవితేజ గురించి వచ్చిన ఆ న్యూస్ ఫేక్

This is the real thing about the fake news about Ravi Teja remunaration
This is the real thing about the fake news about Ravi Teja remunaration

ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందకపోవడంతో దాదాపు పది కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అందుకే రవితేజ తన పారితోషకం మళ్లీ తిరిగి ఇచ్చేసారంటూ వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే రవితేజ తన రెమ్యూనేషన్ తిరిగి ఇవ్వడం అనేది వాస్తవం కాదని ఇది కేవలం ప్రచారం మే అని చెప్తున్నారు. రవితేజ ఈ మూవీ అనే కాదు. ఎలాంటి పరాజయం వచ్చిన మూవీస్ అయినా కానీ తను ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వరు అని ప్రచారం చేస్తున్నారు. ఈ రామారావు ఆన్ డ్యూటీ మూవీ సంబంధించి కూడా అదే జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే రవితేజ మూవీ చేయడానికి మునుపే వీటి గురించి అన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారట. ఒకవేళ మూవీ హిట్ అయిన, అవ్వకపోయినా తననుండి మళ్లీ రెమ్యూనేషన్ తిరిగి తీసుకోకూడదు.

అని రవితేజ ముందే ఓ అగ్రిమెంట్ చేసుకుంటారట. అందుకే మిగిలిన హీరోలు ఎప్పుడైనా మూవీలు విఫలమైనప్పుడు వారు పారితోషకం తిరిగి ఇచ్చిన, రవితేజ మాత్రం తిరిగి ఇవ్వరని మునుపు నుంచే డైరెక్టర్లు నుంచి మాట తీసుకుంటాడట. అందుకే ఆయన పారితోషకం మళ్లీ తిరిగి ఇవ్వరట. అలా ఇవ్వకపోయినా పెద్దగా రెస్పాండ్ అవ్వరట. అయితే రవితేజ ఇంకా కొన్ని మూవీలతో అభిమానులు ముందుకు రావడానికి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన చేస్తున్న పలు మూవీలోకి టైగర్ నాగేశ్వరావు మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.