Lady Finger Benefits : బెండకాయ బ్రెయిన్ షార్ప్ గా చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. పచ్చి కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. చాలామంది కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకుంటారు. కానీ అన్ని కూరగాయలు తినడం అలవాటు చేసుకోవడం మంచిది. కొన్ని కూరగాయలు పోషకాలు అధికంగా లభిస్తాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. బెండకాయ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిస్తే ఇక మీరు వదలరు. బెండకాయ తినడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉండటమే కాకుండా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని చాలామంది అంటుంటారు. ఆ సంగతి ఎలా ఉన్నాte లేడీ ఫింగర్ లో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుందని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాయను తరచుగా మనం తినే ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దీనిలో దొరికే లేక్టీన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అరికడుతుంది. బెండలో ఉండే పోలేట్లు వివిధ రకాల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. పోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ ,క్లోమం, ఊపిరితిత్తుల, క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బెండలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
Lady Finger Benefits : బెండకాయలు తినడం వల్లే కలిగే ప్రయోజనాలు ఇవే..

మన తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవడంలో సమృద్ధిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు ,మినరల్స్ తో సహా వివిధ రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయలు పెక్టిన్ నే మూలం ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాలన తగ్గించి, మంచి కలక్ట్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా మీ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు…. రక్తపోటు ప్రమాదం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. బెండకాయ డయాబెటిస్ వంటి వ్యాధులను నియంతరిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థ తో పాటు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది. ఇతర కూరగాయల కంటే బెండలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ సమస్యలను తగ్గించుకోవచ్చు. బెండకాయ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ద్రోహత పడుతుంది. ఇటువంటి కూరగాయలతో మీ రోగ నిరోధక శక్తి పెంపొందించవచ్చు. కాబట్టి అన్ని రకాల కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది