Viral Video : ఏనుగులు చూడటానికి భీకరంగా ఉండటమే కాదు.. అవి చేసే పనులు కూడా ఒక్కోసారి ఫన్నీగా ఉంటాయి. వాటికి కోపం వస్తే ఎంత ఆగ్రహంతో ఊగిపోతాయో.. వాటికి ఏది కనిపిస్తే దాన్ని నాశనం చేస్తాయో… ప్రేమ వస్తే కూడా అంతే. ప్రేమ వస్తే కూడా అవి చాలా ముచ్చట పడే పనులు చేస్తాయి. అందుకే.. ఏనుగులంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా చిన్నారులకు అయితే ఏనుగులు అంటే చాలా ఇష్టం. ఏనుగులు కనిపిస్తే చాలు.. చిన్నారులు ఎగిరి గంతేస్తారు.

ఏనుగులు కూడా చిన్నారులతో ఆడుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. మనుషులను అవి ఒక్కోసారి ఇమిటేట్ చేస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగు చేసిన వింత చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఏనుగుల్లో ఈ టాలెంట్ కూడా ఉందా బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video : చిన్నారిని భలే ఇమిటేట్ చేసింది
ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఏనుగును ముందు నిలుచున్న చిన్నారి ఆ ఏనుగును చూసి డ్యాన్స్ చేస్తుంది. పాప డ్యాన్సును చూసిన ఏనుగు కూడా చెవులను ఆడిస్తూ డ్యాన్స్ చేసినట్టుగా తన నడుమును ఊపింది. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. ఏనుగు భలేగా డ్యాన్స్ చేసింది. ఆ చిన్నారిని భలే ఇమిటేట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వీడియోను వైరల్ చేస్తున్నారు. నిజానికి.. ఏనుగుల వీడియోలకు సోషల్ మీడియాలో బాగా రీచ్ ఉంటుంది. నెటిజన్లు ఏనుగుల వీడియోలను వైరల్ చేస్తుంటారు. ఈ ఏనుగు చేసిన వింత ప్రవర్తన కూడా జనాలకు నచ్చింది. అందుకే వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Who did better? ???? pic.twitter.com/ku6XRTTSal
— Dipanshu Kabra (@ipskabra) September 17, 2022