Viral Video : పిజ్జాను ఇలా కూడా తయారు చేస్తారా? దీన్ని తింటే జన్మలో పిజ్జా జోలికి పోరు

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. నిజానికి సోషల్ మీడియాలో రోజూ కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. అన్ని వీడియోలు వైరల్ కావు. అన్ని వీడియోలలో ఆసక్తికరమైన విషయాలు ఉండవు. కొన్ని వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు. ఎప్పుడు అవుతాయో తెలియదు. కొన్ని వీడియోలలో సత్తా ఉన్నా వీడియోలు వైరల్ కావు. అసలు జనాలకు ఏ వీడియో నచ్చుతుందో ఏ వీడియో నచ్చదో చెప్పడం కష్టం. అదే కదా రీడర్స్ నాడి పట్టుకోవడం కష్టం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నిజానికి అది ఫుడ్ కు సంబంధించిన రెసిపీ.

pizza made with chocolate and ice cream video viral
pizza made with chocolate and ice cream video viral

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను చూశాం కదా. బుల్లెట్ బండి వీడియో, బంగారం వీడియోలు, ఇతర వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వాళ్లను చాలామందినే చూశాం. తాజాగా వెరైటీ పిజ్జా తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : ఐస్ క్రీమ్ తో పిజ్జా తయారు చేస్తారా?

నిజానికి పిజ్జా అంటేనే చాలామందికి నోరూరుతుంది. కానీ.. ఈ పిజ్జాను చూస్తే నోరు ఊరడం కాదు.. జన్మలో పిజ్జాను తినడమే మానేస్తారు. ఎందుకంటే ఈ పిజ్జాను ఎలా తయారు చేశారో తెలుసా? పిజ్జా సాస్ కు బదులు చాక్లెట్ వేసి.. చీజ్ కు బదులు ఐస్ క్రీమ్ వేసి పిజ్జా తయారు చేశాడు ఈ వ్యక్తి. మామూలుగా అయితే పిజ్జాలో పన్నీర్, చీజ్, సాస్ లాంటివి వేస్తారు. పిజ్జా టేస్ట్ ఒక్కసారి చేస్తే చాలు.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. కానీ.. ఈ పిజ్జాను ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక జీవితంలో మీరు పిజ్జాను తినరు. పిజ్జాను చూస్తేనే మీరు యాక్ అంటారు. అలా తయారు చేశారు ఈ పిజ్జాను. మరి మీరు కూడా ఈ పిజ్జాను ఎలా తయారు చేశారో చూడండి.

 

View this post on Instagram

 

A post shared by RJ Rohan (@radiokarohan)