Guppedantha Manasu 20 September 2022 Episode : వసుధార ఏ తప్పూ చెయ్యలేదు అని దేవయాని కుట్రని రిషి తెలుసుకుంటాడా?

Guppedantha Manasu 20 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 20-September-2022  ముందుగా మీ కోసం. జగతి మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉండగా, అక్కడికి గౌతమ్ వచ్చి కంగారుగా, వసుధార కనిపించడం లేదు అని అనడంతో, అందరూ కలిసి వసుధార కొసం వెతుకుతూ ఉంటారు. గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతాడు, వసుధార కనిపించడం లేదు నీకేమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు. నాతో ఏమీ చెప్పలేదు అని రిషి అనడంతో, గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు, ఈ వసుధార కి ఏమైంది అని వెతుకుతూ, మేడపైకి వెళ్తాడు, అక్కడ వసుధార దీపాన్ని ఆకాశం లోకి వదులుతూ, జగతి మేడం విషయంలో నేననుకున్నది జరగాలి అని కోరుకుంటూ దీపాన్ని వదులుతుంది. రిషి వసుధార దగ్గరికి వచ్చి, వెళ్లావు అనుకున్నాను అని అనడంతో, మీకు చెప్పకుండా నేను ఎలా వెళతాను సార్ అని వసుధార అంటుంది.

Guppedantha Manasu 20 September 2022 Episode : వసుధార ఏ తప్పూ చెయ్యలేదు అని దేవయాని కుట్రని రిషి తెలుసుకుంటాడా?

అన్నీ నాకు చెప్పి చెయ్యాలి అని ఏమీ లేదు కదా అని అంటాడు. అలా ఎందుకు అంటున్నారు సార్ అయిన నా వెైపు కూడా చూడకుండా మాట్లాడుతున్నారు, నేనెంత తప్పు చేశానా అని అనడంతో, అన్ని ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు అని అంటాడు, వసుధార ఒకసారి నేను చెప్పేది కూడా వినండి సార్ అని చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ వుంటాడు. తెల్లవారాక వసుధార వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది, దేవయాని వెటకారంగా తనకి చీర తీసుకొనిరా ధరణి అతిథి మర్యాదలు చెయ్యాలి కదా అంటూ, కొద్దిసేపు వెటకారంగా తనతో మాట్లాడుతూ ఉంటుంది, తర్వాత రిషి, వసుధార ఇంటినుంచి బయలుదేరతారు. కారులో వెళుతూ వుండగా వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎలా రిషి సార్ తో మాట్లాడాలి అని, ఇంతలో వసుధార చేయి తగలగానే, రిషి చేయి తీస్తాడు.

Guppedantha Manasu 20 September 2022 Episode
Guppedantha Manasu 20 September 2022 Episode

ఒక దగ్గర కారు ఆపి రిషి వసుధారాణి ప్రశ్నిస్తాడు నువ్వు నన్ను రిషిగా ప్రేమించావా లేకపోతే జగతి మేడం కొడుకుగా ప్రేమించావా అని అడుగుతాడు, అప్పుడు వసుధార మీరు జగతి మేడం కొడుకే కదా సార్ అని అంటోంది. నువ్వు తెలివిగా సమాధానం చెప్పకు వసుధార అని రిషి అంటాడు, సార్ మీరు ఎలా అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరే నా ప్రాణం సార్ అని వసుధార అంటుంది, ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు, రిషి మనసులో ఇలా అనుకొంటాడు నీ మీద నాకు ప్రేమ పోలేదు, కోపం మాత్రమే ఉంది వసుధార అని, తర్వాత రిషి వసుధారని ఇంట్లో దించుతాడు, ఆ తరవాత రిషి తన ఇంటికి వెళ్లగానే, గౌతమ్ ప్రశ్నిస్తాడు, వసుధార ఎక్కడ అని, వాళ్ళ ఇంట్లో దించేసి వస్తున్నాను అని అనడంతో, అలా మధ్యలోనే వదిలేస్తావా అని గౌతమ్ అనడంతో, లేదు నేను వదిలేయలేదు, తనే వెళ్ళిపోవాలనుకుంది తన నిర్ణయాన్ని నేను గౌరవించాను అని గౌతమ్ కి సమాధానం చెబుతాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.