Suma : బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ కనకాల. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వరుస షోలతో, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. సుమ అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఆమెపై అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతారు. ఇప్పటివరకైతే ఆమె యాంకరింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. ఇటీవల సుమ కనకాల నాగశౌర్య హీరోగా నటించిన ‘ కృష్ణ వింద విహారి ‘ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకరింగ్ చేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో సుమా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ కామెడీని పండించింది.
Suma : టు మచ్ చేస్తున్న సుమ… పబ్లిక్ లో ఆ మాటలు ఏంటి
అయితే ఈవెంట్లో బ్రహ్మాజీతో సుమ మాట్లాడిన కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈవెంట్లో సుమా బ్రహ్మాజీ సరదాగా ముచ్చటించుకున్న కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. యాంకరింగ్ చేస్తూ స్టేజ్ దిగి సుమ బ్రహ్మాజీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దీంతో హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుకుందాం అంటూ బ్రహ్మాజీ తో సరదాగా మాటలు కలిపే ప్రయత్నం చేసింది.

దీనికి బ్రహ్మాజీ కూడా నవ్వుతాడు. ఈ క్రమంలో సుమ ఆయనని అడిగిన ప్రశ్నలు ఎక్కడికో దారి తీశాయి. ఆమె మాట్లాడుతూ మీ ఏజ్ ఎంత అంటూ బ్రహ్మాజీని అడుగుతుంది. దీంతో బ్రహ్మాజీ నవ్వుతూ యూ నాటీ ఆంటీ అంటూ బదులిచ్చాడు. దీంతో సుమ ముఖం వాడిపోయింది. అంతేకాదు ఏంటో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది నాకెందుకు ఈ కర్మ అంటూ కట్ చేస్తుంది. దీంతో ఈ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రహ్మాజీ కామెంట్ చేసింది అనసూయని అంటూ కొందరు మళ్ళీ గత విషయాలను తవ్వుకుంటున్నారు.