Viral Video : గులాబ్ జామ్ తో బర్గర్.. ఎవరైనా తింటారా దీన్ని.. యాక్.. ఛీ.. అంటున్న నెటిజన్లు

Viral Video : గులాబ్ జామ్ తో బర్గర్.. అరెరె.. ఈ కాంబినేషన్ ఏదో వింతగా, విచిత్రంగా ఉందే అంటారా? అవును.. ఇది రేర్ కాంబినేషన్.మీరు ఎప్పుడైనా మ్యాగీ పానీపూరీ తిన్నారా? చాక్లెట్ బిర్యానీ తిన్నారా? యాపిల్ పకోడీ.. ఓరియో పకోడీ..  ఇలా రకరకాల వెరైటీ కాంబో ఫుడ్ గురించి విన్నారు కదా. ఈ టైప్ ఫుడ్ ను చాలామంది తయారు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామ్ బర్గర్.

have you ever tried gulab jamun burger
have you ever tried gulab jamun burger

సాధారణంగా బర్గర్ ఎలా తయారు చేస్తారో తెలుసు కదా. చీజ్, సలాడ్, చికెన్ తో లేయర్స్ గా ఫామ్ చేసి చేస్తారు. బర్గర్ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. బర్గర్ కనబడితే చాలు లొట్టలేసుకుంటూ తింటాం. కానీ.. గులాబ్ జామ్ తో చేసిన బర్గర్ ను ఎప్పుడైనా తిన్నారా? చీ.. యాక్ అంటారా? కానీ.. ఇప్పుడు అదే సరికొత్త ట్రెండ్ అయింది.

Viral Video : గులాబ్ జామ్ బర్గర్ ను ఎలా తయారు చేయాలంటే?

గులాబ్ జామ్ బర్గర్ ను తయారు చేసే విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఒక బ్రెడ్ ను తీసుకొని మధ్యలో కట్ చేసి.. అప్పటికే రెడీ చేసి ఉంచుకున్న గులాబ్ జామ్ ను పేర్చి దానిపై చిక్కని చక్కెర పాకాన్ని పోయాలి. బ్రెడ్ ముక్కను దాని మీద పెట్టి పేనంపై పెట్టి కాసేపు ఉంచాలి. కొంచెం వేడి అయ్యాక గులాబ్ జామ్ రెడీ అవుతుంది. వేడి వేడి గులాబ్ జామ్ ను గుటకాయస్వాహా చేయడమే. ప్రజెంటింగ్ గులాబ్ జామ్ బర్గర్ అంటూ ట్విట్టర్ లో ఓ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.