Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వన్ సినిమా తెలుసు కదా. ఒక నవల ఆధారంగా వచ్చిన సినిమా అది. తమిళ్ సినిమా అయినప్పటికీ ఆ సినిమాను తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. ఆ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటించారు. విక్రమ్ తో పాటు కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించారు. పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ గా రెండో పార్ట్ కూడా త్వరలో రాబోతోంది. అయితే పాన్ ఇండియా లేవల్ లో సెప్టెంబర్ 30 న రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ మూవీ తమిళంలో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇతర భాషల్లో మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది.

తెలుగులోనూ పెద్దగా ఆడలేదు. దానికి కారణం.. తమిళ్ ఫ్లేవర్. తెలుగులో ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే.. 50 రోజుల్లో పీఎస్ 1 ఇప్పటి వరకు 500 కోట్ల మార్క్ ను దాటేసింది. అయితే.. ఇది నిజంగా నిజమేనా అనే డౌట్ చాలామందిలో వచ్చింది.
Ponniyin Selvan : 500 కోట్లు వచ్చినా సినిమా ఫ్లాపేనా?
పీఎస్ వన్ సినిమా విడుదలై 500 కోట్లను మాత్రమే క్రాస్ చేయడంతో.. ఒక పాన్ ఇండియా సినిమా 500 కోట్లే కలెక్ట్ చేస్తే అది హిట్టా ఫ్లాపా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే.. పాన్ ఇండియా లేవల్ లో విడుదలైన కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. కానీ.. పీఎస్ 1 మాత్రం 500 కోట్లే రాబట్టడంతో అసలు ఆ సినిమా హిట్ అని ఎలా చెబుతారు అంటున్నారు. ఏది ఏమైనా.. పీఎస్ 2 కూడా త్వరలో రాబోతుండటంతో కనీసం పీఎస్ 2 అయినా ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.