Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. ఆయనకు ఉన్న క్రేజ్, పాపులారిటీకి కారణం జబర్దస్త్. కేవలం జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అదిరే అభి టీమ్ లో ఒక సైడ్ కంటెస్టెంట్ గా ఉన్న హైపర్ ఆది ఇప్పుడు తెలుగు బుల్లితెరనే ఏలుతున్నాడంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. చాలా ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో డక్కామొక్కీలు తిని మరీ ఆది ప్రస్తుతం ఈ స్టేజ్ కు చేరుకున్నాడు.

బుల్లితెర మాత్రమే కాదు.. వెండి తెర మీద కూడా హైపర్ ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే. వెండి తెరపై పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించి తన కామెడీ టైమింగ్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు హైపర్ ఆది. ఆయన వేసే పంచులకు అర్థం తెలుసుకొని నవ్వే లోపు మరో పంచ్ ను వేసేస్తాడు ఆది. అలా కంటిన్యూగా ఆది వేసే పంచులకు నవ్వలేక కడుపు నొప్పి లేవాల్సిందే.
Hyper Aadi : శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదే ఆదికి గుండు కొట్టారు
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను మల్లెమాల యాజమాన్యం రిలీజ్ చేసింది. ఆ ప్రోమోను చూసి హైపర్ ఆది అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఆ ప్రోమోలో హైపర్ ఆదికి గుండు కొట్టిస్తారు. స్టేజ్ మీద అలా గుండు కొట్టించే సరికి హైపర్ ఆది కూడా షాక్ అవుతాడు. అసలు ఏం జరిగిందంటే.. యాంకర్ రష్మీ ఒక ఫన్నీ గేమ్ పెడుతుంది. ఆ గేమ్ ప్రకారం.. స్క్రీన్ మీద కనిపించే ఒక నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవాలని చెబుతుంది. ఆ గేమ్ ఆడటానికి ముందుగా హైపర్ ఆది వస్తాడు. 9 నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాని వెనుక 30 సెకన్ల పాలు నచ్చిన వాళ్లకు ముద్దు పెట్టాలి అని ఉంటుంది. దీంతో ఐశ్వర్యను పిలుస్తాడు. ఐశ్వర్య రాబోతుంది కానీ.. పొట్టి నరేష్ వద్దంటూ వారిస్తాడు. ఐశ్వర్యకు ముద్దు పెట్టనివ్వడు. దీంతో మరో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆది. 11 సెలెక్ట్ చేసుకోగా.. దాని వెనుక గుండు కొట్టించుకోవాలి అని ఉంటుంది. దీంతో వెంటనే బుల్లెట్ భాస్కర్, ఇతర కంటెస్టెంట్లు స్టేజ్ మీదికి వెళ్లి హైపర్ ఆదిని పట్టుకొని మరీ గుండు గీకిస్తారు. దీంతో హైపర్ ఆది షాక్ అవుతాడు. వద్దు అని వారిస్తున్నా కూడా వినకుండా హైపర్ ఆదికి గుండు కొట్టడంతో అందరూ షాక్ అవుతారు. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.