తన యాంకరింగ్, స్పంటేనియాస్ పంచులతో అవతలి వారిని ఉక్కిరిబిక్కిరి చేసే Anchor Suma సుమ కనకాల అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె అరెస్ట్ అయింది నిజంగా కాదు. ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా అరెస్ట్ అయింది. అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఈ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఆయన గతంలో చేసిన చివరి రెండు సినిమాలు పూర్తిగా సోషల్ సబ్జెక్ట్ తో చేశారు.

గతంలో కేవలం కామెడిని నమ్ముకొని సినిమాలు చేసి నవ్వించిన అల్లరి నరేష్ ప్రస్తుతం అలాంటి సినిమాలేం చేయడం లేదు. అల్లరి నరేష్ నటించిన తాజా మూవీకి ప్రచారం కల్పించడం కోసం ప్రమోషన్ స్టంట్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్ సుమను అరెస్ట్ చేశారు. సుమ సంకెళ్ళతో బంధించబడి ఉన్న పిక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
కొందరు ఇది నిజమే అని భ్రమ పడుతున్నారు. ఇదిలా ఉండగా యాంకర్ గా కూడా సుమ జోరు తగ్గింది. శ్రీముఖి, రష్మీ గౌతమ్ వంటి గ్లామరస్ యాంకర్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వయసు పెరిగిన నేపథ్యంలో ఆమె కూడా ఆసక్తి తగ్గించారు.