లిక్కర్ స్కామ్ లో కవిత ఖేల్‌ఖతం..? బహిర్గతమైన చాటింగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు వేగం మందగించిందని ప్రచారం జరుగుతోన్న వేళ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలనానికి తెరలేపాడు. తాను ఆప్ నేతల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత సన్నిహితుడికి రూ. 15 కోట్లు అప్పగించినట్లు ఇటీవలే జైలు నుంచి లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా మరో బాంబ్ పేల్చాడు.

ఈ పదిహేను కోట్ల డబ్బును ముట్ట జెప్పెందుకు కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. ఆమెతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ లను తాజాగా బయటపెట్టాడు. కేజ్రీవాల్‌ను AKగా, సత్యేంద్ర జైన్‌ను SJగా కోడ్ నేమ్‌తో చాటింగ్ చేసినట్టుగా పేర్కొన్నాడు. ఇక ఎమ్మెల్సీ కవిత పేరును Kavita Akka TRS తో నంబర్ సేవ్ చేసుకున్నట్టుగా అందులో కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఏంటనే దానిపై ఈడీ కీలక ఆధారాల అన్వేషణలో ఉండగా సుఖేష్ చంద్రశేఖర్ బయటపెడుతోన్న వివరాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు.

ఆప్ నేతలు కవితకు రూ 15 కోట్లు ఎందుకిచ్చారు? ఆప్ నేతలతో కవితకునున్న ఆర్ధిక లావాదేవీలు ఏంటి? అనే విషయంలో త్వరలోనే ఈడీ మరోసారి కవితను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. కానీ మంగళవారం తనకు కాలు ఫ్రాక్చర్ అయిందనీ, మూడు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్న కవిత.. ఈడీ నోటిసులు ఇచ్చిన ఇప్పట్లో ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం లేదు.

కవితతో సుఖేష్ చంద్రశేఖర్ వాట్సప్ చాటింగ్ ఇదే.

సుకేశ్ చంద్రశేఖర్: AK బ్రదర్‌ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది.

ఎమ్మెల్సీ కవిత : ఓకే.

సుకేశ్ చంద్రశేఖర్: దాన్ని నేను JHకు పంపించాలా?

ఎమ్మెల్సీ కవిత : నోనో, అరుణ్‌ను నీకు కాల్ చేయమని చెబుతా. దాన్ని ఆఫీసుకు పంపించాలి.

సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా.. మీరు చెప్పినట్టే చేస్తా.

ఎమ్మెల్సీ కవిత : అతను నీకు త్వరలో కాల్ చేస్తాడు.

సుకేశ్ చంద్రశేఖర్: దాన్ని ఈ రోజే మీకు పంపించాలని SJ బ్రదర్ చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత : అవును.

సుకేశ్ చంద్రశేఖర్‌: నేను మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటాను అక్కా.

ఎమ్మెల్సీ కవిత : అంతా బాగానే ఉంది కదా? నాన్న ఆరోగ్యం ఎలా ఉంది?

సుకేశ్ చంద్రశేఖర్: అడిగినందుకు థ్యాంక్స్ అక్కా.. కీమో చికిత్స తీసుకుంటున్నారు.

ఎమ్మెల్సీ కవిత : ఆయన బయటపడతారు.

సుకేశ్ చంద్రశేఖర్ : అవును అక్కా. దేవుడు అనుగ్రహిస్తాడు.

ఎమ్మెల్సీ కవిత : టేక్ కేర్, మళ్లీ తర్వాత మాట్లాడతా.

సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా, ఎనీటైమ్. కేసీఆర్గారికి నా నమస్కారాలు చెప్పండి.

సుకేశ్ చంద్రశేఖర్: అక్కా. సరుకు డెలివరీ అయింది.

ఎమ్మెల్సీ కవిత : ఓకే…

సుకేశ్ చంద్రశేఖర్: అక్కా.. దయచేసి AK లేదా SJ కు inform చేయండి.

ఎమ్మెల్సీ కవిత : మనీశ్‌తో మాట్లాడా.

సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా.. థ్యాంక్స్.

Advertisement
Advertisement
Advertisement