SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? అయితే.. ఈ వార్త మీకోసమే. ఎందుకంటే.. ఎస్బీఐ కొన్ని అకౌంట్లను క్లోజ్ చేస్తుంది. దానికి కారణం.. కేవైసీ అప్ డేట్ చేయకపోవడమే. ఇప్పటి వరకు చాలా అకౌంట్లను ఎస్బీఐ క్లోజ్ చేసింది. నిజానికి.. ఖాతాదారులు అందరూ కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి బ్యాంక్ తన ఖాతాదారులకు చెబుతోంది. మెసేజ్ లు కూడా పంపిస్తోంది.

కానీ.. చాలామంది కేవైసీని అప్ డేట్ చేసుకోలేదు. దీని కారణంగా చాలా ఖాతాలను బ్యాంక్ క్లోజ్ చేసింది. ఒకసారి ఖాతా క్లోజ్ అయితే దాని ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగవు. అకౌంట్ బ్లాక్ అయిపోయినట్టే. ఒకవేళ అకౌంట్ ను తిరిగి పొందాలంటే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
SBI : రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు కేవైసీ అప్ డేట్ కోసం ఖాతాదారులకు బ్యాంక్ రిక్వెస్ట్
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయి. హ్యాకర్లు పెరిగారు. ఎక్కువగా బ్యాంక్ కస్టమర్లనే టార్గెట్ చేసుకొని మోసాలు చేస్తుండటంతో రిజర్వ్ బ్యాంక్ కేవైసీ అప్ డేట్ ను కంపల్సరీ చేసింది. ఇదివరకు పదేళ్లకు ఒకసారి కేవైసీ అప్ డేట్ జరిగేది. కానీ.. ఇప్పుడు మూడేళ్లకు ఒకసారి కేవైసీని అప్ డేట్ చేస్తున్నారు.
అయితే.. ఎటువంటి సమాచారం లేకుండా బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేశారంటూ కొందరు ఖాతాదారులు బ్యాంక్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ.. కేవైసీ ప్రక్రియ గురించి ఖాతాదారులకు ముందే సూచనలు జారీ చేశామని.. మెసేజ్ లు కూడా పంపించామని.. మెయిల్స్ కూడా వెళ్లాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం జులై నుంచి బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు అప్ డేట్ చేసుకున్నా సరే.. తిరిగి కేవైసీని అప్ డేట్ ఖచ్చితంగా చేసుకోవాలని బ్యాంక్ ఖాతాదారులకు సూచించింది.