Cooking Oil Prices : ఈ రోజుల్లో వంట నూనె కొనాలంటే వందలకు వందలు పోయాల్సిందే. లీటర్ ఆయిల్ కొనాలంటే రెండు వందలు పెట్టాల్సిన పరిస్థితి. 5 లీటర్ల నూనె క్యాన్ కొనాలన్నా వెయ్యికి పైనే వెచ్చించాల్సిన పరిస్థితి. దాని వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్య కొన్ని రోజులు నూనె ధరలు తగ్గినట్టుగా తగ్గి మళ్లీ పెరిగాయి. అయితే.. కొన్ని రోజుల్లో వంట నూనె ధరలు తగ్గనున్నాయట. అవును.. మరికొన్ని రోజుల్లో వంట నూనెల ధరలు భారీగా తగ్గనున్నట్టు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం.. వంటనూనెల ధరలు భారీగా తగ్గనున్నట్టు తెలుస్తోంది. లీటరుపై కనీసం రూ.15 తగ్గే అవకాశాలు ఉన్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ పై కనీసం రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గనున్నాయట. అలాగే.. పామాయిల్ నూనెపై కూడా లీటరుకు రూ.7 నుంచి రూ.8 వరకు తగ్గనుందట. సోయాబీన్ ఆయిల్ పై కూడా 5 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.
Cooking Oil Prices : వంట నూనెల క్యాటగిరిలో 13.26 శాతం ద్రవ్యోల్బణం
నిజానికి.. వంట నూనెల క్యాటగిరీలో ఇటీవల 13.26 శాతం ద్రవ్యోల్బణం నమోదయింది. దాని వల్ల.. వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. నిజానికి.. భారతదేశంలో కనీసం సగం వంట నూనెను ఇతర దేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల అంతర్జాతీయ పరిస్థితులు వంటనూనెల రేట్లు పెరగడానికి దోహదపడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో వంటనూనెల ముడిసరుకు ధరలు తగ్గడంతో త్వరలోనే మన దేశంలో ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.