Business Idea : కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ప్రారంభించే వారికి లోన్స్ అందిస్తుంది. అయితే ఆ రుణాలను సామాన్యుడు పొందటం అంతా ఈజీ కాదు. అనేక పథకాలు రుణాలు ఇస్తామని చెప్పినప్పటికీ ఎక్కువ వ్యాపారాలు చేసేవారికి రుణాలను అందిస్తున్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ క్లారిటీ ట్రస్ట్ ఫండ్, జెడ్ సర్టిఫికెట్ స్కీం వంటి కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ పథకాల కింద చిన్న వ్యాపారాలను ప్రారంభించే వారు ఈజీగా లోన్ పొందవచ్చు. ఎవరైనా ఇంటి వద్ద ఉండేవారు అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలనుకుంటే యంత్రానికి 8.18 లక్షల వరకు లోన్ పొందవచ్చు.

దీంతోపాటు ఎంటర్ ప్రీనర్ సపోర్ట్ స్కీం కింద రూ 1.91 లక్షల లోన్ పొందవచ్చు. చిన్న విడిభాగాల విక్రయించటం ఈరోజుల్లో మంచి వ్యాపారంగా నడుస్తుంది. వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల విభాగాలు నట్లు, బోల్ట్ లు వంటి విడిభాగాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించవచ్చు. దీనిని ప్రారంభించడానికి 1.88 లక్షలు అవసరం. ఈ వ్యాపారంతో మనం లక్ష వరకు సంపాదించవచ్చు. దీనికోసం కేంద్రం ద్వారా లోన్ పొందవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రుచికరమైన ఆహారాలను తినేందుకు బాగా ఇష్టపడుతున్నారు. అలా రుచికరమైన కారం పొడులు, మసాలా పొడులకు మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి వాటిని ఇంటి వద్ద తయారుచేసి అమ్మవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 1.66 లక్షల పెట్టుబడి అవసరం. దీనికి బ్యాంక్ లు కూడా రుణాన్ని అందిస్తున్నాయి. చిన్నపాటి ఫర్నిచర్ దుకాణాన్ని పెట్టుకోవడానికి 1.85 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
ముద్ర పథకం కింద బ్యాంకు నుంచి లోన్ కూడా పొందవచ్చు. ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. దేశంలో పట్టణాలు, నగరాలలో అత్యంత భారీగా డిమాండ్ ఉంది. దీనికోసం లక్షల్లో పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న షాపు ఓపెన్ చేసి బిజినెస్ ప్రారంభించవచ్చు. ప్రస్తుతం బేకరీ ఫుడ్ ను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు అందుకే దీనికి రోజురోజుకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మూడు నుంచి నాలుగు లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి కొన్ని యంత్రాలు కూడా అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం అందరూ ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఈ వ్యాపారం మంచిగా కొనసాగుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బిజినెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కింద ముద్ర లోన్స్ ఈజీగా పొందవచ్చు.