Guppedanta Manasu 24 October Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 589 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధార రిషి ని ఓదారుస్తూ రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడు రిషి డాడీ వాళ్లు వస్తారా వస్తారా అని అడుగుతూ నేను డాడీని చాలా బాధ పెట్టాను. పెద్దమ్మ విషయంలో అలాగే ఇంకా అని మహేంద్ర గురించి బాధపడుతూ ఉంటాడు.
అప్పుడు వసుధార రిషికి ధైర్యం చెబుతూ మీరు రెడీ అవ్వండి సార్ కాలేజీకి వెళ్దాం వాళ్లు అక్కడికి వస్తారేమో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి మేడంకి మెయిల్ పెట్టు వాళ్లు కాలేజీకి తప్పకుండా వస్తార అని అంటూ జగతి మేడం నీకు చెప్పిందా నువ్వు నాకు చెప్పడం లేదా వసుధార అని తనని అనుమానిస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార మీరు నన్ను అనుమానిస్తున్నారా.. నేను మీ నీడని మీ అడుగులో అడుగుని మీ జీవితం పంచుకునే దాన్ని అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నాకేం చేయాలో అర్థం కావడం లేదు వసుధార డాడ్ వాళ్లు వస్తారా డాడీ అలా ఎలా వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉండగా… వసుధార మీరు రెడీ కండి నేను టీ తీసుకొస్తాను అని వెళ్ళిపోయి కిచెన్ రూమ్ లోకి వెళ్ళగా.. అక్కడ ధరణి మహేంద్ర వాళ్ళ గురించి ఆలోచిస్తూ పాలు పొంగుతున్న చూసుకోకుండా ఉంటుంది. అంతలో వసుధారవెల్లి మేడం ఏం చేస్తున్నారు పాలు పొంగుతున్న చూసుకోవడం లేదు అనగానే.. ధరణి చిన్న మామయ్య వాళ్ళు అలా వెళ్ళిపోవడం ఏంటి దీనికి అంతటా కారణం పెద్దత్తయే అని అంటూ ఉంటుంది అప్పుడు వసుధార కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి.
వాటిని ఎలా దాటుకోవాలి తెలుసుకోవాలి అని ధరణికి ధైర్యం చెప్పి కాఫీ ఇచ్చి రిషికి కాఫీ తీసుకొని వెళ్తూ ఉండగా దేవి అని వస్తూ ఉంటుంది. అప్పుడు ఓసుదార టీ ఇమ్మంటారా మేడం అని అడగగానే.. ఇది నీ రెస్టారెంట్ కాదు నాకు నోటీయడానికి అవసరం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు థాంక్స్ మేడం మీరు మళ్ళీ ఎక్కడ తీయమంటారు. నేను అది కలిపి ఇచ్చేటప్పుడు టైమంతా వేస్ట్ అవుతుంది. అని తనకి సెటైర్ వేస్తూ నేను ఇక్కడే ఉంటాను మహేంద్ర సార్ వాళ్ళు వచ్చేవరకు అని అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని దీనిని కట్ చేయాలి దీనికి తెలివితేటలు బాగా ఎక్కువ ఉన్నాయి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే టీ తీసుకెళ్లి రిషికిచ్చి తాగమని చెప్తుంది అప్పుడు రిషి తాగుకుంటూ తొందరగా కాలేజీకి వెళ్దాం అక్కడికి జగతి మేడం వాళ్ళు కంపల్సరిగా వస్తారు నేను డాడ్ ని హగ్ చేసుకుని బ్రతిమిలాడుకుంటాను సారీ చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారేమో అని మనసులో బాధపడుతూ కాలేజీకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే.. గౌతమ్ ఇంట్లో జగతి మహేంద్ర ఉంటారు.
వాళ్లు కి గౌతమ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర రిషి ఫోటోలు చూసి బాధపడుతూ ఉండగా.. రిషి చాలా బాధపడుతున్నారు మీరు ఎందుకు ఇలా చేశారు. అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర సూర్యున్ని చూడాలంటే ఎండాకాలం రావాలి కొన్ని కొన్ని చూడాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి మేము రిసీసంతోషం కోసమే చేశామన్నట్లుగా చెప్తూ ఉంటారు. అప్పుడు జగతి గౌతమ్ ని ఇక్కడుండి. నిన్ను బాధ పెడుతున్నామా అని అనగానే అలా ఏం లేదు మీరు ఎన్నాళ్లున్నాలన్న ఇక్కడే ఉండండి. మీకు సేవ చేసుకోవడం నా అదృష్టం అని అంటూ మీ పని అయ్యేవరకు ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కాలేజీకి వెళ్లి మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వసుధార రిషి అప్పుడు వసుధార బాధపడుతూ వాళ్లు మన వల్లే వెళ్లిపోయారా అని రిషితో అంటూ ఉంటుంది.
అప్పుడు రిషి కోప్పడుతూ ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకో మా డాడీ నన్ను నిలదీసి అడగొచ్చు కదా ఇది తప్పు అని చెప్పవచ్చు కదా తనకి అడిగే స్వతంత్రం ఉంది కదా ఇలా ఎలా వెళ్ళిపోతాడు నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగా.. అప్పుడు వసుధార ఒకవేళ జగతి మేడంని మీరు ఏమైనా అన్నారా అన్నట్లుగా ఉంటుంది. అప్పుడు రిషి కోపంగా వసుధరా ఇక చాలు నేను ఎవరి మనసు బాధపెట్టను అందరూ నా మనసే బాధ పెడతారు అని బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..