Astrology Tips : వంట గదిలో ఈ వస్తువులు అస్సలు కింద పడకూడదని మీకు తెలుసా…?

Astrology Tips : సాధారణంగా మనం వంట గదిలో పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక వస్తువు పొరపాటున చేయి జారి కింద పడుతుంటాయి. అయితే కిచెన్ లో కొన్ని వస్తువులు నేలపాలు అయితే అది ఇంటికి అరిష్టం కలుగుతుందట. భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఇవి సూచనలట. వంట గదిలో మిరియాలు పొరపాటున కూడా కింద పడిపోకూడదు. ఇది ఒక చోట పడిన ఇల్లంతా వ్యాపిస్తాయి. అదేవిధంగా ఇవి కింద పడటం వలన ఇంటిపై చెడు ప్రభావం పడుతుంది. ఇది వివాహితుల జీవితాలపై చెడు ప్రభావాలను చూపుతోంది. దీంతో భార్యాభర్తల మధ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే వంట గదిలో ఏమైనా వస్తువులను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయడం మంచిది. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చేతిలో నుంచి ఉప్పు జారి కింద పడితే ఇంట్లో ప్రతికూల సమస్యలు రాబోతున్నాయని అర్థం.

Astrology Tips These things fall in the kitchen happened bad luck
Astrology Tips These things fall in the kitchen happened bad luck

ఉప్పు కింద పడితే ఇంట్లో ఒత్తిడి, డబ్బు నష్టం కలుగుతుంది. గృహ దోషాల సూచన కూడా ఉండవచ్చు. డబ్బు సమస్యలను పెంచుతుంది. కిందపడిన ఉప్పుతో కూడా కష్టాలు పెరుగుతాయి. ఉప్పును ఫ్రీగా తీసుకోవడం, ఇవ్వడం రెండూ అప్పుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే ఎవరైనా కొత్త ఇంట్లోకి వెళితే పాలు పొంగిస్తారు. ఇలా పొంగించడం అనేది ఇంటికి శుభం. అయితే ఆ తర్వాత పదేపదే పాలు పొంగడం పాల గిన్నె, గాజులు పడిపోవడం అనేది దురదృష్టానికి సూచన. ఎందుకంటే పాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. కుటుంబంలో ప్రతికూల శక్తి పెరుగుతుందని ఇది సూచిస్తుంది.

అలాగే వంటగదిలో ఉండే బియ్యం లేదా ఇతర ఆహార పదార్థాలు మొదలైనవి నేలపై పదే పదే పడకూడదు. ఇది కూడా అరిష్టానికి సూచన. వండిన ఆహారం కూడా కింద పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్లేట్లో సగం అన్నం తినే అలవాటుని మానుకోవాలి. ఇలా తినడం అనేది దరిద్రం. దీనిని వెంటనే మానుకోవాలి. అలాగే నూనెకు పరమశివుడితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి నూనెను ఇంట్లో కింద పడకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే ఇలా పదేపదే ఇంట్లో నూనె కింద పడితే కుటుంబంలో చాలా కష్టాలు వస్తాయని అర్థం. ఇది శని భగవానుడి చెడు దృష్టి వలన కుటుంబంలో నష్టాలు జరుగుతాయి.