Clove Farming : భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు అనేవి కచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే పురాతన కాలం నుండి ఈ సుగంధ ద్రవ్యాలను మన పూర్వీకులు సైతం ఉపయోగిస్తూ వస్తున్నారు.అదే క్రమంలో వీటిని మతపరమైన కార్యక్రమాలలో కూడా వినియోగించడం మొదలుపెట్టారు. అయితే ఆహార పదార్థాలలో ప్రత్యేక స్థానం పొందిన లవంగాలు ఆరోగ్యానికి దివ్య ఔషధ గుణాలు కలిగిన వాటిలో ఒకటిగా పేర్కొనవచ్చు. ఇక ఇది ఒక సతత హరిత మొక్క. దీనిని ఒక్కసారి నాటినట్లయితే కొన్ని సంవత్సరాల తరబడి ఫలాలను ఇస్తూనే ఉంటుంది. భారతదేశంలో పలుచోట్ల వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.అయితే వీటిని పండించేందుకు అనువైన ప్రదేశం ఇసుక నేల అని చెప్పాలి. అయితే చాలామంది రైతులు ఈ లవంగాలు సాగు ద్వారా కూడా అధిక మొత్తంలో లాభాలను ఆర్జీస్తున్నారు. మరి ఈరోజు ఆ లవంగాల సాగు గురించి వివరంగా మనం తెలుసుకుందాం.
అయితే లవంగం అనేది విచ్చుకొని ఒక పువ్వు. కావున ఈ లవంగాలను మట్టిలో నాకినట్లయితే మొక్కలు రావు. కాబట్టి దీనికి సంబంధించిన విత్తనాలను మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది.ఇక దీనికి సంబంధించిన విత్తనాలను ఆన్లైన్లో clove seeds for planting అని సెర్చ్ చేసినట్లయితే ఈ కామర్స్ సైట్లలో ఈ విత్తనాలను మీరు పొందవచ్చు.లేదా లవంగం మొక్క నుండి పండిన పండ్లను తీసుకుని విత్తనాలుగా తయారు చేసుకోవచ్చు. ఇక వర్షాకాలం అనేది లవంగం మొక్కలు నాటడానికి అనువైన కాలంగా చెబుతుంటారు. జూన్ నుండి జూలై మధ్యలో ఈ లవంగం మొక్కలు నాటడం ఉత్తమం. ఇక వీటిని నాటడానికి 75 సెంటీమీటర్లు పొడవు ,వెడల్పు ,లోతు గల గొయ్యిని తీయాల్సి ఉంటుంది. ఇలా గొయ్యికి గొయ్యి కి మధ్య 6 నుండి 7 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
అలాగే లవంగం సాగుకు మొదట నీటిపారుదల చాలా అవసరం. వేడి వాతావరణం లో నిరంతరం వీటికి నీరు అందించాలి. ఇక లవంగం మొక్కలు 4 నుండి 5 సంవత్సరాల లోపే దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో లవంగాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 10 రూపాయలకు కేవలం 5 లవంగాలు మాత్రమే లభించడం గమనార్హం. అయితే లవంగం మొక్క నుండి దాదాపు 2 నుండి 3 కేజీలు లవంగాలను పొందవచ్చు. ఇక మార్కెట్ లోని హోల్సేల్ ధర ప్రకారం చూస్తే కేజీ లవంగాలు ధర రూ.800 నుండి రూ.1000 మధ్య ఉంది.ఈ లెక్కన లవంగం సాగుతో మీరు అధిక లాభాలను గడించవచ్చు. అయితే ఈ సాగు చేయాలి అనుకున్న వారు ముందుగా లవంగం సాగు చేసే రైతులను సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రారంభించడం ఉత్తమం.