Nara Bhuvaneswari : చంద్రబాబు రిమాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా భువనేశ్వరి…ఇక ఆశలు వదులుకోండి…

Nara Bhuvaneswari  : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు బయటకు వస్తారా లేదా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మళ్ళీ రిమాండ్ ను పెంచుతూ ఎసిబి కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటికే రెండుసార్లు రిమాండ్ విధించగా మూడోసారి కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారు..? కారణం ఏంటో కూడా చెప్పకపోతే ఎలా అంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు మరియు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసిపి ప్రభుత్వం కావాలనే చంద్రబాబుపై కక్ష సాధింపు అరెస్టును చేపట్టిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ,కోడలు నారా బ్రాహ్మణి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రిమాండ్ ను పొడిగించడంతో తాజాగా ఈ విషయంపై భువనేశ్వరి స్పందించారు.

Advertisement

nara-bhuvaneshwari-made-sensational-comments-on-chandrababus-remand-give-up-hope-open-in-google-translate-feedback

Advertisement

అయితే చంద్రబాబుపై సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ తో పాటు మరో రెండు స్కామ్ లను కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఇటీవల నారా లోకేష్ ని కూడా విచారించడం జరిగింది. ఇక చంద్రబాబును మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని…కనీసం గవర్నర్ అనుమతి తీసుకోకుండా , సంప్రదించకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవి ఏమీ పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను పెట్టుకొని బెయిల్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రిమాండ్ ను పెంచుకుంటూ పోతున్నారు తప్ప ముందస్తు బెయిల్ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ప్రస్తుతం చంద్రబాబుకున్న ఒక్కొక్క దారి మూసుకుపోతున్నాయని అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆయన ఒక కేసులో తప్పించుకున్నప్పటికీ మరొక కేసులో ఆయన అరెస్టు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయ.

nara-bhuvaneshwari-made-sensational-comments-on-chandrababus-remand-give-up-hope-open-in-google-translate-feedback

ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం అసలు బాగోలేదని, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు లభించడం లేదని, ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షిణిస్తుందని జైల్లో ఫ్యాన్ కూడా లేదని, స్నానానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు మరియు టిడిపి అధికారులు జైలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు టిడిపి కార్యక్రమాలు నారా లోకేష్ యువగలం పాదయాత్ర కూడా ఆగిపోవడం జరిగింది. అయితే మరో రెండు రోజుల్లో కోర్టుకు దసరా సెలవులు కూడా రానున్నాయి. దీంతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దసరా అనంతరం నవంబర్ లో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి మరియు నారా బ్రాహ్మణి ముందుకు వచ్చి టిడిపి పార్టీని నడిపించాల్సిందిగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

Advertisement