Business Ideas : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంతమందికి బిజినెస్ చేయాలి అని ఉన్న ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కాదు. కొందరు ప్రారంభంలోనే బిజినెస్ ఐడియాలు వదిలేస్తుంటారు. మరి కొందరు సొంత వ్యాపారం అయితే రిస్క్ ఉంటుంది కదా అని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ బిజినెస్ లో రిస్క్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి బిజినెస్ లేసిందంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో ఒకటి ఎలక్ట్రిక్ తందూర్ మిషన్. ఈమధ్య భారీ యంత్రాలకు బదులు చాలా తక్కువ సైజులో పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.
అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా చిన్న సైజులో అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ తందూర్ మిషన్. ఇది చిన్న వ్యాపారులకు బెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. తందూరంటే బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్లకు తందూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తందూరి రోటీలు, తందూరి చికెన్, తందూరి మటన్ ఇలా తందూరి స్పెషల్ వంటకాలు చాలానే ఉంటాయి. ఈ మిషన్లు చూడడానికి మైక్రో ఓవెల్స్ లా ఉన్న తందూర్ మిషన్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా తందూరి వంటకాలను బొగ్గుమీద కాల్చుతారు. తందూరి చికెన్ అంటే బొగ్గు మీద కాల్చి ఇస్తారు. అలాగే తందూరి వంటకాలు ఏవైనా అలా బొగ్గుమీద కాల్చి ఇస్తారు.
కానీ బొగ్గు అవసరం లేకుండా ఎలక్ట్రిక్ తందూర్ మిషన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా నాన్ వెజ్, వెజ్ వంటకాలు, పిజ్జాలు రోటీలు, పరోటాలు ఇలా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే ఈ మిషన్ లతో పిజ్జా సెంటర్ పెట్టుకోవచ్చు. తందూరి వంటకాల సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే క్లౌడ్ కిచెన్ పెట్టుకొని ఆన్లైన్లో వంటకాలను డెలివరీ చేయవచ్చు. అలాగే చిన్న రెస్టారెంట్లు కూడా ప్రారంభించవచ్చు. ఈ మిషన్ ధర 5000 రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. సెమీ ఆటోమేటిక్ అయితే తక్కువ ధర ఉంటుంది. ఒకటి రెండు మిషన్ లను కొనుక్కొని ఎటువంటి బిజినెస్ పెట్టిన నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.