Vastu Tips : వాస్తు ప్రకారం వస్తువులు ఇంటికి అదృష్టం, శాంతిని చేకూరుస్తాయి. అలాగే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహం ఉండడం చాలా మంచిది. తాబేలు బయటి విపత్తుల నుండి రక్షించే బలమైన షెల్ కలిగి ఉంటుంది. తాబేలు ఒకటి రాజవంశం పెరుగుదల విజయవంతమైన జీవం మరి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ వస్తువులు తప్పకుండా ఇంట్లో ఉంచాలి. నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవడం వలన మనసుకు సామరస్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. రంగులతో నిండిన ఈకలు జీవిత వేడుకలను గుర్తు చేస్తూనే ఉంటాయి.. నెమలి ఈకలు ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఇవి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అలాగే క్రిస్టల్ శ్రీ యంత్రం వలన శ్రేయస్సు, సంపద, విజయం, అదృష్టం, కీర్తి కలుగుతాయి. ఈ వస్తువులు తూర్పు, పడమర దిశలో ఉంచాలి.

ఇంటికి అదృష్టం పట్టాలంటే అత్యంత అవసరమైన వాస్తు వస్తువు పువ్వు, నీరు. ఒక క్రిస్టల్ బౌల్లో గులాబీ రేకులతో కొంచెం నీరు కలపాలి. ఇది సానుకూలత శక్తి ఉంచుతుంది. వాస్తు శాస్త్ర చిట్కాల ప్రకారం ఇది ఇంటికి సంపదను కలిగిస్తుంది. అలాగే విండ్ చైమ్ లు ఇంటికి అందాన్ని తీసుకొస్తాయి. అలాగే సానుకూలత శాంతి, ఆనందం తీసుకొస్తాయి. మెటల్ విండ్ చైమ్ లు ఇంటి ఉత్తర, పడమర, వాయువ్య ప్రాంతాలలో పెట్టుకోవాలి. ఇంటి ముందు ద్వారం వద్ద పెద్ద విగ్రహాన్ని ఉంచడం వలన ప్రతికూల శక్తి నుండి అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ విగ్రహాన్ని తూర్పు వైపు ఉంచాలి. లాఫింగ్ బుద్ధని కూడా ఇంట్లో ఉంచుకోవడం వలన మేలు జరుగుతుంది.
అధికారాన్ని సంపదను సృష్టించే శక్తివంతమైన అరోవానా చేపలను ఇంట్లో ఉంచుకోవాలి. అరోవానా చేపను రాజ్యంలో చక్రవర్తిగా పరిగణిస్తారు. కాబట్టి అరోవానా చేపల విగ్రహం సంపాదన ఆకర్షించడానికి సరైనదని నమ్ముతారు. ఇది ఇంట్లో ఉంటే అప్పుల సమస్య కూడా తీరుతుంది. అలాగే అక్వేరియంతో ఇంటిని అలంకరించడం వలన ఇంట్లోనే అనేక దోషాలను తొలగించుకోవచ్చు. అధిక రక్తపోటు, ఆందోళనలను తగ్గించవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటికి వాస్తు ప్రకారం ఇండోర్ ఫౌంటెన్ చాలా మంచిది. దీనిని ఇంటికి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం మూలలో ఉంచాలి. నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ఇలా వస్తువుల ఇంట్లో ఉంచుకోవడం వలన ఇంటికి అదృష్టం పడుతుంది.