Intinti Gruhalakshmi 18 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 18-September-2022 ఎపిసోడ్ 741 ముందుగా మీ కోసం. నందు సామ్రాట్ మీద కోపంతో, సామ్రాట్ అన్న మాటల్నే తలచుకుంటూ, డ్రింక్ చేస్తాడు, రోడ్డు పైన తాగుతూ, సామ్రాట్ తులసికి ప్రపోజ్ చేసినట్టు అదంతా ఊహించుకుంటాడు, సామ్రాట్ మీదికి బీర్ బాటిల్ ని విసిరినట్టు ఊహించుకుంటూ నడి రోడ్డు పైనే విసిరేస్తాడు, డ్రింక్స్ చేసి, కార్ డ్రైవ్ చేస్తాడు, మధ్యలో కార్ ఆగిపోవడంతో మెకానిక్ ని పిలిపించి రిపేర్ చేయించుకొంటాడు, మీరు డ్రింక్ చేసి వున్నారు సార్, డ్రైవ్ చెయ్యకండి, యాక్సిడెంట్ అవుతుంది సార్ అని అనడంతో, నందుకి కొత్త ఐడియా వస్తుంది, సామ్రాట్ మీద కోపంతో, సామ్రాట్కి యాక్సిడెంట్ అవ్వాలి అని, సామ్రాట్ కారు బ్రేక్ వైర్లను తెంపాలి అని, వాళ్ళ ఇంటికి వెళతాడు, అక్కడ వాచ్మెన్ కూడా లేకపోవటంతో, నందు అనుకున్నంత పని చేస్తాడు, అయితే యాక్సిడెంట్ జరిగినట్టు, తులసి సామ్రాట్కి యాక్సిడెంట్ అయినట్టు, నందు కలగంటాడు. అలా వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్లు కళ రావడంతో, ఒక్కసారిగా నందు ఉలిక్కిపడి, తులసీ అని గట్టిగా అరుస్తాడు.
Intinti Gruhalakshmi 18 September Today Episode : నందు చేసిన పనితో ప్రమాదంలో పడ్డ సామ్రాట్ హని
దాంతో లాస్య ఏంటి తులసి అని అరిచావు అని నందుని ప్రశ్నిస్తూ ఉంటుంది, నీ మాజీ భార్య కలలోకి గానీ వచ్చిందా, అని ఇలా ప్రశ్నిస్తుoది నందుని, నందు తడబడుతూ వుంటాడు, నేను తులసి కాదు, లాస్య అని అరిచాను అని ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. ఒక వైపు సామ్రాట్ తులసిని పికప్ చేసుకోవడానికి తులసి వాళ్ళ ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతూండగా, హని సరదాగా వాళ్ళ నాన్న, బాబాయ్ తో మాట్లాడుతూ ఉంటుంది, నాకు తులసి ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది నాన్నా, అక్కడ వాళ్లందరితో సరదాగా నేను ఆడుకుంటాను, మళ్ళీ నువ్వు నన్ను ఇంటికి తీసుకొని రావడానికి వస్తువు కదా నాన్నా, నేను వస్తాను నువ్వెలాగొ అక్కడికే వెళుతున్నావు కదా నన్ను అక్కడ డ్రాప్ చెయ్ అని అడుగుతుంది, హనీ నేనూ వస్తాను నానా తులసి ఆంటీ వాళ్ల ఇంటికి అనడంతో, సామ్రాట్ వాళ్ల బాబాయి తీసుకొనివెళ్లురా హానీ కొద్ది సేపు సరదాగా ఆడుకుంటుంది అని అనడంతో, సామ్రాట్ ఒప్పుకుంటాడు.

సామ్రాట్, హని ఇద్దరూ ఇంటి నుండి బయలు దేరుతారు, నందు ఆలోచిస్తూ ఉంటాడు, సామ్రాట్ ఇంటి నుండి బయలుదేరాడా, నైటు అలా చేశాను,ఇప్పుడు ఎలా ఏమౌతుందో అని కంగారు పడుతూ ఉంటాడు, మరోవైపు హాని, సామ్రాట్ కారులో వెళుతూ ఉంటారు, హని తొందరగా వెళదాం నాన్న, తులసి ఆంటీ వాళ్ల ఇంటికి అని అంటూ, స్పీడ్గా వెళ్ళండి నాన్నా అనడంతో, హని చెప్పినట్టు సామ్రాట్ స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, స్పీడ్ గా వెళుతూ ఉండగా, బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సామ్రాట్, కానీ బ్రేక్స్ పడవు, ఒక చెట్టుకు వెళ్లి ఢీ కొట్టుకుంటారు, ఇద్దరికి తలకి దెబ్బ తగులుతుంది, సామ్రాట్కి హనీకి. ఆ విషయం తెలుసుకున్న తులసి షాక్ అవుతుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. యాక్సిడెంట్కి గురైన సామ్రాట్, హానీ లను తులసి రక్షించగలుగుతుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తోంది.