Husband For Hire : టైటిల్ చూడగానే షాక్ అయి ఉంటారు. మీరు చదివిన టైటిల్ నిజమే.. ఆ భార్య చేసే పని కూడా నిజమే. ఇదేం విడ్డూరం బాబోయ్.. సొంత భర్తను అద్దెకు ఇవ్వడం ఏంటి.. ఆయనేమన్నా.. వస్తువా? లేక.. ఏదైనా వాహనమా అని ఆశ్చర్యపోకండి.. అందులోనే ఉంది అసలు తిరకాసు.. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.

లారా యంగ్.. అనే మహిళది బ్రిటన్. రెంట్ మై హ్యాండీ హస్ బెండ్ అనే ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది ఆ మహిళ. ఆ వెబ్ సైట్ ద్వారానే తన భర్తను అద్దెకు ఇస్తుంది ఆ మహిళ. ఇప్పటి వరకు ఎవ్వరికీ రాని ఆలోచన అది. తన భర్త ఇంటి పనులు చేయడంలో దిట్ట. చిన్న చిన్న పనులు చకచకా చేసేస్తాడు. పెయింటింగ్ వేయడం కావచ్చు.. ఇంటిని అలంకరించడం కావచ్చు.. కార్పెట్లు సెట్ చేయడం.. టైల్స్ సెట్ చేయడం.. ఇలా.. అన్ని రకాల ఇంటి పనులు చేయడంలో తన భర్త జేమ్స్ దిట్ట.
దీంతో.. తన భర్త చేసే పనుల ద్వారా ఎందుకు డబ్బులు సంపాదించుకోకూడదు అనే ఆలోచన వచ్చింది లారాకు. అలా ఓ వెబ్ సైట్ పెట్టి తన భర్తను అద్దెకు ఇస్తోంది లారా.
Husband For Hire : ఒక రోజుకు లారా తన భర్తను అద్దెకు ఇచ్చి ఎంత సంపాదిస్తోందో తెలుసా?
ఒక రోజు ఎవరికైనా తన భర్తకు అద్దెకు ఇస్తే.. 35 పౌండ్లు వసూలు చేస్తుందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.3400 అన్నమాట. బకింగ్ హామ్ షైర్ లో వీళ్లు నివాసం ఉంటారు. తనకు ముగ్గురు పిల్లలు. కానీ.. ఇద్దరు పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారట. దీంతో పిల్లలను చూసుకోవడం కోసం జేమ్స్ ఉద్యోగాన్నే మానేశాడట. అప్పటి నుంచి ఇంట్లో ఖాళీగా ఉండటంతో లారా ఇలా అతడి నైపుణ్యాలను అందరికీ అందేలా చేస్తోంది.
జేమ్స్.. వాళ్ల ఇంటిని కూడా సుందరంగా తీర్చిదిద్దాడట. ప్రస్తుతం జేమ్స్ కు చేతినిండా పని దొరుకుతోంది. ప్రతి రోజు ఎవరో ఒకరు జేమ్స్ ను అద్దెకు తీసుకెళ్తున్నారు. వాళ్లకు కూడా పని తక్కువ ఖర్చులో అయిపోతోంది. అయితే.. భర్తను అద్దెకు ఇవ్వడం ఏంటి అంటూ స్థానికంగా కొందరు వాళ్లను విచిత్రంగా చూస్తున్నారట. అవేవీ పట్టించుకోకుండా.. భర్త స్కిల్స్ ను ఉపయోగించి.. రెండు చేతులా సంపాదిస్తోంది లారా.