Karnataka Temple : పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారా….అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోండి అనుకున్నది జరుగుతుంది….

Karnataka Temple : వివాహం అనేది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అయితే చాలామందికి పెళ్లి ఘడియలు వచ్చిన సరే వివాహం మాత్రం జరగదు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారికే ఒక శుభవార్త తీసుకొచ్చాం. ఈ సమస్యతో బాధపడే వారికి పరిష్కారం చూపే వినాయకుని గుడి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ దేవాలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి పెళ్లిళ్లు జరగడం ఖాయమట. ఇక ఈ ప్రముఖ దేవాలయం ఉత్తర కర్ణాటకలో ఉంది.

Advertisement

 are-you-worried-about-not-getting-married-but-visit-this-temple-and-what-you-want-will-happen

Advertisement

ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలోని వినాయకుని దర్శించుకునేందుకు 10లక్షలకు పైగా భక్తులు వస్తూ ఉంటారని ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే సాధారణంగా ఏ దేవాలయంలో చూసిన వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఈ దేవాలయంలో మాత్రం నిలుచున్న ఆకారంలో కనిపిస్తూ రెండు చేతులతో దర్శనం ఇస్తాడు. అంతేకాక ఈ ఆలయం అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక ఈ దేవాలయాన్ని దాదాపు 1500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక అక్కడి ప్రాంత ప్రజలు నమ్మకాల బట్టి చూస్తే ఈ గుడిని సందర్శించుకున్న వారికి వెంటనే వివాహం కుదురుతుందట.

 are-you-worried-about-not-getting-married-but-visit-this-temple-and-what-you-want-will-happen

ఇలా వివాహం కుదిరిన వెంటనే ఆ స్వామి చెంతకు వెళ్లి రెండు చిట్టిలను ఉంచుతారట. దేవుని రెండు పాదాల వద్ద రెండు చిట్టిలను పెట్టి దేవుని అంగీకారం అడగడం ఇక్కడి ప్రజల ఆనవాయితిగా తెలుస్తోంది. కాగా కుడి పాదం వద్ద ఉన్న చిట్టి కింద పడితే దేవుడు పెళ్లికి అంగీకరించాడని, ఎడమ పాదం వద్ద ఉంచిన చిట్టి కింద పడితే దేవుని అంగీకారం లేదని స్థానికులు పూజారులు విశ్వసిస్తారు. ఇక దేవుని అనుగ్రహం లేదని భావించిన వారు మరో సంబంధాన్ని వెతుక్కుంటారని ఆలయ పూజారులు ,స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని బస్సు రైలు మార్గం ద్వారా కూడా సులువుగా చేరుకోవచ్చు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం పుణ్యమని పండితులు చెబుతున్నారు.

Advertisement