Andhra Pradesh : ఇటీవల తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణ రోజాపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని లేపే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇటీవల బండారు చేసిన వ్యాఖ్యలకు మీడియా ముందు మంత్రి రోజా కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ…..రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడితే…ఆ స్త్రీ మరల రాజకీయాల్లో ముందుకు నడవగలదా ? ఇక అలాంటి వారికి నారా లోకేష్ మద్దతుగా నిన్న ట్విట్ చేశారు. దాదాపు నేను తెలుగుదేశం పార్టీకి 10 సంవత్సరాలు పని చేశా. రాజకీయంగా అందులో చాలా నష్టపోయి అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసా…
అయినా ఇంకా నన్ను వేధిస్తున్నారు అంటూ రోజా కన్నీరు పెట్టుకుంది. బండారు మాట్లాడిన మాటలు చెప్పాలంటేనే అసహ్యంగా ఉందని, ఇలాంటి నేతల వలన మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారని రోజా చెప్పుకొచ్చింది. బండారు చేసిన వ్యాఖ్యలను సమర్ధించడం అతని అరెస్టును లోకేష్ తో పాటు ఇతర టిడిపి నేతలు ఖండించడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. వారి తల్లి , బిడ్డ , భార్యలకు ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే వ్యవహరిస్తారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించింది. బ్లూ ఫిలింలో నటించానంటూ వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
సీడీలు ఉన్నాయని అంటున్నారు కానీ ఎప్పుడు నిరూపించలేదు. మహిళలకు నచ్చినట్లు బ్రతకవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది..మధ్యలో మీరెవరో నా క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికి అంటూ మంత్రి రోజా ఘాటుగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలను ఆటవస్తువులు గా చూస్తున్నారంటూ రోజా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది ఇలా ఉండగా అసభ్యకర రీతిలో రోజాను అవమానించిన కారణంగా మహిళా కమిషన్ బండారు పై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణమూర్తికి 41 ఏ నోటీసులు జారీ చేశారు.