Pooja Tips : ఎంత కష్టపడ్డ సంపాదించిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండటం లేదా! పక్కింటి వాళ్లు మీ సంపాదనను చూసి ఈర్ష్యపడుతున్నారా! అయితే ఒకసారి ఉప్పుతో ఇలా చేసారంటే మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. రాతి ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అందరికి తెలిసిందే. దీనినే కళ్లు ఉప్పు అని కూడా అంటారు. ఈ కళ్లు ఉప్పుతో ఇంట్లోని చాలా సమస్యలకు పరిష్కారం చెప్పవచ్చు. ఈ కళ్లు ఉప్పు వలన మీ ఇంట్లో ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే నరదిష్టి, నరగోష సమస్యలకు ఈ ఉప్పుతో పరిష్కారం చూపవచ్చు. అయితే కళ్ల ఉప్పు ఎటువంటి సమస్యలను తొలగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శుక్రవారం లేదా మంగళవారం రోజున ఇంటికి ఒక మట్టి కుండను తెచ్చుకోవాలి. ఆ మట్టికుండను నీళ్లతో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఎండనివ్వాలి. ఆదివారం లేదా మంగళవారం రోజున ఆ మట్టి కుండలో సగం వరకు కళ్లు ఉప్పును వేసుకోవాలి. తరువాత దాని మీద ఒక కాగితాన్ని మడిచి పెట్టి ఉప్పుపై కప్పి వేయాలి. మీరు సొంతంగా సంపాదించిన డబ్బులను ఈ మట్టి కుండలో పెట్టి రాత్రంతా దేవుడి గదిలో కాని బీరువాలో కాని ఒక మూలగా దీన్ని అమర్చాలి. ఇలా చేయడం వలన ఎన్నో చేతులు మారిన డబ్బులో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ప్రొద్దున్నే లేచి ఆ డబ్బును తీసి మీ అవసరాలకు వాడుకోవచ్చు.ఇలా మూడు నెలలు చేయడం వలన మీరు సంపాదించిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉంటుంది. అలాగే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే వెంటనే తిరిగి వస్తాయి.
Pooja Tips : లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉప్పుతో ఇలా చేయండి.

ఒక గాజు బౌల్ తీసుకొని దానిలో నిండుగా నీళ్లు పోసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా కళ్లు ఉప్పు వేసుకొని ఎవరు తిరగని, ఎవరు చూడని చోట ఈ బౌల్ ని పెట్టుకోవాలి. వారం రోజుల తరువాత ఆ నీటిని తీసి మళ్లీ నీళ్లు పోసి అక్కడే పెట్టుకోవాలి. ఇలా రోజు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మరొక గిన్నెలో ఉప్పు తీసుకొని అందులో ఏడు లవంగాలను తీసుకొని సవ్యదిశలో ఏర్పాటు చేసుకోవాలి. తరువాత ఆ గిన్నెను పట్టుకొని గదిలోని ప్రతి మూలకు తిరగాలి. ఇలా మూడు నెలలు చేస్తే నరదిష్టి, నరగోష వంటి సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. అలాగే సంపాదించిన డబ్బు కూడా నిలకడగా ఉంటుంది.