TDP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికల హడావుడి మొదలు కానుంది. 2014 లో ఉమ్మడి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసి.. ఏపీని ఎక్కడికో తీసుకెళ్లాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. ఏపీకి ఒక రాజధాని కూడా లేకపోవడంతో దాని కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించి.. దాని అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. కానీ.. 5 ఏళ్లలో చంద్రబాబు ఏపీని డెవలప్ చేయలేరు కదా. 2019 లో ఏపీ ప్రజలు చంద్రబాబును గద్దె దించడంతో ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

2019 లో ఏదో బై చాన్స్ జగన్ సీఎం అయ్యారు కానీ… 2024 లో ఎట్టిపరిస్థితుల్లోనూ మాదే అధికారం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు టీడీపీ ముఖ్య నేతలు. చంద్రబాబునాయుడు కూడా అదే ధీమాతో ఉన్నారట. ఎలాగూ ఇక ఎన్నికలకు 2 ఏళ్లే సమయం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచే గెలుపు కోసం, ప్రజల మెప్పు కోసం చంద్రబాబు భారీ ప్లాన్లు వేస్తున్నారు. అందులో భాగంగానే భారీ పాదయాత్రకు చంద్రబాబు తెరలేపారు.
TDP : జనసేన, వైసీపీ కూడా పాదయాత్రకు ప్లాన్
నిజానికి ఎన్నికలు 2024లో రానున్నాయి. అంటే ఇంకో రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఒకవేళ ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే.. చంద్రబాబు ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటన కార్యక్రమాన్ని బాబు ప్రారంభించారు.
2024 లో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్నది ప్రస్తుతం చంద్రబాబు ముందున్న కల. దాన్ని ఛేదించాలంటే భారీగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీల విషయంలోనూ.. ఎమ్మెల్యేల విషయంలోనూ క్లీన్ స్వీప్ చేసింది. జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలామంది టీడీపీకి చెందిన ముఖ్య నేతలు టీడీపీని వదిలి వైసీపీ బాట పట్టారు.
అందుకే.. టీడీపీని మరింత బలోపేతం చేసి.. వైసీపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీనే అని జనాల్లోకి వెళ్లేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి.. ఎన్నికల వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా భారీ పాదయాత్రను నిర్వహించడం కోసం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఆ పాదయాత్రలోనూ కేవలం ఇద్దరే కీలకం కానున్నారు. చంద్రబాబు వెంట నడవనున్నారు. అందులో ఒకరు నారా లోకేశ్ కాగా.. మరొకరు అచ్చెన్నాయుడు. నిజానికి.. లోకేశ్ బాబుతో సుమారు 4000 కిలోమీటర్ల పాదయాత్రను చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మరోవైపు జనసేన పార్టీకి పాదయాత్రకు ప్లాన్ చేస్తోంది. వైసీపీ కూడా రాయలసీమ నుంచి పాదయాత్రకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేశ్ ఒక పాదయాత్ర.. అచ్చెన్నాయుడు బీసీ యాత్ర పేరుతో మరో పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది.
అంటే.. చంద్రబాబుతో పాటు.. అదే సమయంలో చినబాబు, అచ్చెన్నాయుడు కూడా భారీ పాదయాత్రకు ప్లాన్ చేశారన్నమాట. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం చేజారిపోకూడదని చంద్రబాబు భారీ వ్యూహాలే రచిస్తున్నారు.. మరి అవి వర్కవుట్ అవుతాయో లేదో తెలియాలంటే ఇంకో రెండేళ్లు వేచి చూడాల్సిందే.