Astro tips : వైద్య శాస్త్ర ప్రకారం ఈ విశ్వంలో చెట్లు లేకపోతే సమస్త ప్రాణకోటికి జీవన ఆధారం ఉండదు. ఈ చెట్ల వలన సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి. అందుచేతనే ప్రతి యొక్కప్రాణకోటికి ఆకలి బాధ తీరుతుంది. ఈ చెట్లు అనేవి లేకపోతే జీవి మనుగడ కొనసాగదు. ఆకలి బాధతో జీవరాశులు ఉక్కిరిబిక్కిరి అవుతాయి. చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి, వర్షాలవలనే పంటలు పండుతాయి, ఆ పంటలతోనే జీవరాశులకు ఆకలి బాధ తీరుతాయి. అందుకే చెట్లను దైవంగా ప్రార్ధిస్తారు. ఇలా పూజించడం జీవి పుట్టుక నుంచి ఆనవాయితిగా వస్తుంది. అయితే కొన్ని చెట్లను దైవంగా పరిగణించి వాటిని పూజిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఈ ఐదు చెట్లు పూజించడానికి యోగ్యమైనవి. ఈ 5 చెట్లను పూజించడం ద్వారా మీ ఇల్లు సిరిసంపదలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అయితే ఇప్పుడు ఏ చెట్లను పూజించడం ద్వారా మనకు మంచి జరుగుతుందో చర్చించుకుందాం…
1) హిందూ ధర్మంలో తులసి చెట్టుకు ఎంతో పాముఖ్యత ఉంది. తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అలాగే తులసి మొక్క నారాయణుడికి ఇష్టమైనదిగా భావిస్తారు.ప్రతిరోజుఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తులసిమొక్కకు కొన్ని నీళ్లను పోయాలి. తరువాత తులసి చెట్టుకింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన మీకు లక్ష్మీదేవిఅనుగ్రహం కలుగుతుంది. దీనివలన మీ ఇల్లు సిరిసంపదలతో, సుఖసంతోషాలతో కళకళలాడుతుంది. అలాగే ఆదివారం రోజు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. అలాగే ఏకాదశి రోజునతులసి మొక్కను ప్రార్ధించి, ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. అలాగే ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచడం కాని, చెట్టును తీసివేయడం కాని చేయరాదు.
Astro tips : ఈ 5 చెట్లను పూజించండి

2) అలాగే రావిచెట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. వైద్య శాస్త్ర పరంగా రావి చెట్టు వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టు మనకు ఎల్లప్పుడు ఆక్సిజన్ ను అందిస్తుంది. అలాగే రావి చెట్టు ఆధ్యాత్మికంగాను ఎంతో ప్రత్యేకమైనది. ఈ రావిచెట్టుపై పితృదేవతలు నివసిస్తారని కొందరి నమ్మకం. అందుకే ఈ చెట్టును పూజించడం వలన మన ప్రార్ధనలు నేరుగా వారికి చేరుతాయని అంటారు. అలాగే రావి చెట్టు క్రింద ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపాన్నివెలిగించాలి. ఇలా పూజించడం వలన శని దోషం ఉన్నవారికి శని దేవుని నుంచి విముక్తి కలుగుతుంది. దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.
3) వాస్తు ప్రకారంగా మనీ ప్లాంట్ మన ఇంట్లో పెంచుకోవడం వలన ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. ఈ మనీ ప్లాంట్ చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. దీనిని కావాలంటే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. అలా వీలు కాకపోతే ఒక సీసాలో కొన్ని నీళ్లను పోసి అందులో ఈ మనీ ప్లాంట్ మొక్కను వేసుకొని ఇంటి లోపలఉంచుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ మొక్కను ప్రతి రోజు చూడటం వలన మీలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కాబట్టి సాధ్యమయ్యేవరకు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి. ఈ మొక్క మీ ఇంట్లోఉంటే మీ ఇంటి ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.
4)మన పురాణాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. అలాగే మీరు అనుకున్న పని నెరవేరుతుంది. ప్రతి రోజు సాయంత్రం మీ ఇంటిలో పూజ ముగిసాక కచ్చితంగా జమ్మిచెట్టు కింద దీపాన్ని వెలిగించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గంలో ఈ జమ్మి చెట్టును నాటాలి. జమ్మి చెట్టు చుట్టు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చెట్టును ఎక్కువగా విజయదశమి నాడు కొలుస్తారు. అలాగే ప్రతి శనివారం జమ్మిచెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వలన మీరు శనిగ్రహం నుంచి తప్పించుకోవచ్చు.
5) మన హిందు ధర్మంలో అరటి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అరటి చెట్టును ఎక్కువగా గురువారం నాడు కొలుస్తారు. ఇలా చేయడం వలన శ్రీమన్నారాయణుని దివ్య ఆశిస్సులు ఎల్లప్పుడు మీపై కలుగుతాయి. ప్రతి గురువారం ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి అరటి చెట్టుకు నీళ్లు పోసి మినపప్పు, బెల్లంతో ఈఅరటి చెట్టును పూజించాలి. ఇలా చేయడం వలన మీకు, మీ కుటుంబానికి జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఆర్ధికంగా ఎదుగుతారు