Pooja Tips : హిందువుల సంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ రోజున దేవుళ్లకు పూజ ముగిసిన తర్వాత నైవేద్యం తప్పనిసరిగా సమర్పిస్తాము. ఇలా చేస్తే మంచిదని చాలామంది నమ్మకం. అసలు దేవుళ్ళకు పెట్టే నైవేద్యం లో పంచదార వేయవచ్చని కొందరు . మరి కొందరు అసలు వేయవద్దని అంటుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్ర ఏం చెబుతుందో తెలుసుకుందాం.మనం పూజ చేసిన తర్వాత దేవుడికి పెట్టే నైవేద్యం తియ్యగా ఉండేలా చేసి పెడతాం ఇలా వీలుకాకపోతే చక్కెర, పప్పు చెక్కెర, పండ్లు చెక్కెర ఇలా పెడుతుంటారు. ఇది చాలా మంది చేస్తారు. కొద్దిమంది కానీ ఇలా చేయడం వల్ల దోషమని చెబుతుంటారు.
అసలు దేవుళ్ళకు చేసిన నైవేద్యంలో చక్కెర వేయవచ్చా, లేదా అని తెలుసుకుందాం. నైవేద్యం ఎప్పుడు వెండి, బంగారం, లేదా రాగి పాత్రలలో పెట్టాలి . అలాగే నైవేద్యం ఎప్పుడు ప్లాస్టిక్, మరియు స్టీల్, లేదా గ్లాస్ గిన్నెల్లో పెట్టకూడదు. వీటన్నింటి కెల్లా దేవునికి అరటి ఆకుల భోజనం అంటే చాలా ఇష్టం కాబట్టి అరిటాకుల్లో నైవేద్యం పెట్టడం శుభకరం అంటున్నారు పండితులు. కానీ వేద శాస్త్రాలు తెలియజేసింది ఏమనగా నైవేద్యం అంటే మనం ఏ ఆహారాన్ని తీసుకుంటామో అదే ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించడం.
Pooja Tips : దేవుళ్లకు పెట్టె నైవేద్యంలో పంచదార పెట్టవచ్చా

భగవంతుడా మేము ఆహారంగా తీసుకోవడానికి మాకు ఈ పదార్ధాలు మాకు అందించావు. కాబట్టి అందుకే కృతజ్ఞతగా ఈ ఆహారాన్ని మీకు ముందుగా సమర్పిస్తున్నాము అని దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాము దేవుళ్ళు కి ఇలా నైవేద్యం పెట్టడం అంటే దేవుడికి కృతజ్ఞతాభివందనలు తెలియజేయడం. కాబట్టి చక్కెర ని వేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదని జ్యోతిష్య శాస్త్రాలు తెలియజేశాయి. తద్వారా దేవుళ్ళకి చేసే నైవేద్యంలో చక్కెరను కూడా వాడవచ్చని శాస్త్రాలు తెలియజేయడమైనది