Astro tips : లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలని కొందరు వివిధ రకాల పూజలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని కొలుస్తారు. శుక్రవారం నాడు స్ర్తీలు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరచుకొని ,తలస్నానం ఆచరించి, కాళ్లకు పసుపు రాసుకొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. ఎవరైతే తమ ఇంటిని శుభ్రంగా ఉంచి, భక్తి శ్రద్ధలతో తనని కొలుస్తారో అట్టి ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా కొలువుంటుంది. అంతేకాకుండా, బీరువాలో కొన్ని వస్తువులను భద్రపరచడం వలన కూడా లక్ష్మీదేవి కొలువుంటుంది. ఏయే వస్తువులను బీరువాలో భద్రపరిచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
1)లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఎంతో ఇష్టం. శుక్రవారం రోజు 11 లేదా 21 రూపాయలను ఎరుపు రంగు వస్త్రం కట్టాలి. పూజ అయిపోయిన అనంతరం ఈ వస్త్రమును బీరువాలో భద్రపరచాలి.మీరు ఎక్కడైతే నగదును భద్రపరుస్తారో అక్కడ ఈ వస్త్రమును ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఏమైనా ఆర్ధిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లోకి అధిక ధనం చేకూరుస్తుంది. ఇల్లు సిరిసంపదలతో, సుఖసంతోషాలతో కళకళలాడుతుంది.
2)లక్ష్మీదేవికి తామరపువ్వు అంటే ఎంతో ప్రీతి. ఆమె కుర్చునే శీర్షాసనం కూడా తామరపువ్వే. అంతా ఇష్టం తామరపువ్వంటే. లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా తామరపువ్వును సమర్పించాలి. పూజ అయిపోయాక ఆ పువ్వును డబ్బులు దాచుకునే పెట్టెలో కాని బీరువాలో కాని ఉంచాలి. డబ్బులను ఎక్కువగా బీరువాలో దాచుకుంటాం కాబట్టి తామరపువ్వును కూడా అక్కడే భద్రపరచాలి. పువ్వు వాడిపోయాక తీసివేయవచ్చు.ఇలా తామరపువ్వును బీరువాలో ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుందని కొందరి నమ్మకం.
3)అలాగే పసుపు ముద్దను బీరువాలో ఉంచడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం రోజు పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో భద్రపరచాలి. ఇలా భద్రపరచడం వలన ఇంట్లో ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో నివసించే వారందరికి లక్ష్మీదేవి ఆశిస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. కుటుంబీకులు సిరిసంపదలతో, సుఖసంతోషాలతో వర్దిల్లుతారు.
4)అలాగే పసుపు పెన్నీని బీరువాలో భద్రపరచడం శుభప్రదం. శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు కాని దీపావళి రోజున లక్ష్మీపూజ ముగిసిన తరువాత ఈ పసుపు పెన్నీని నగదు పెట్టెలో భద్రపరచాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు మీపై ఉంటుంది. కనుక ఈ నాలుగు వస్తువులను బీరువాలో భద్రపరచుకునేలా చూసుకోండి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.