Ganesh pooja : ప్రతి ఏటా వినాయకుడి పండుగను కుటుంబంలో అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మొదటి రోజు పూజతో మొదలయ్యి చివరి రోజు నిమజ్జనం వరకు భక్తులందరూ ఎంత సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. అయితే గణేశుని పూజ చేసేటప్పుడు కొన్నింటిని తప్పకుండా చేయాలి. ముఖ్యంగా గణేశునికి అంగపూజ లో ప్రతి భాగాన్ని పూజించాలి. ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. ఇలా చేస్తే వినాయకుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. గణేశుడు పూజ లో అంగపూజను తప్పనిసరిగా చేయాలి.
ఈ అంగపూజ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ అంగపూజ పూర్తి అయితేనే వినాయకుడికి పూజ పూర్తిగా అయినట్లు. అంగపూజ లో వినాయకుడి ప్రతి భాగాన్ని పూజించాలి. వినాయకుడు శిరస్సు, విరిగిన దంతం, మూషిక వాహనం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. కనుక గణేశుని ఆరాధన లో వీటిని పూజించడం అసలు మరువకూడదు. మీరు వినాయక చవితి రోజు విగ్రహాన్ని ఇంటికి తీసుకు వచ్చాక అంగపూజ చేయాలి.ముందుగా వినాయకుడి పాదాలను పూజించే టపుడు ‘ఓం విఘ్నేశ్వరాయ నమః పాదౌ పూజయామి ‘ అనే మంత్రాన్ని జపించండి.
Ganesh pooja : వినాయకుడి పూజలో ఇవి తప్పక చేయాలి

తరువాత మూషికం ను పూజించేటప్పుడు ‘ఓం ఆఖూ వాహనాయ నమః ఊరూ పూజయామి’అని, నడుము భాగాన్ని ‘ఓం హీరాంబాయ నమః కటి పూజయామి ‘అని, నాభి ని పూజించే టపుడు ‘ఓం కమృ సూన్ వే నమః నాభి పూజయామి ‘అని, పొట్ట కోసం ‘ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి’ అని, ఛాతిని పూజించేటప్పుడు ‘ఓం గౌరీ సుతాయ నమః సనౌ పూజయామి’అని, హృదయం కోసం ‘ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి’ అని గొంతు భాగం కోసం ‘ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి’
అని భుజ ఆరాధన కోసం ‘ఓం పాషాహస్తయన నమః స్కంథౌ పూజయామి’అని, చేతుల కోసం ‘ఓం గజ వక్త్రాయ నమః హస్తం పూజయామి’, మెడ కోసం’ ఓం స్కందాగ్రజాయ నమః వక్రం పూజయామి ‘, నుదిటి భాగం కోసం ‘ ఓం విఘ్నరాజాయ నమః లలాటం పూజయామి ‘, శిరస్సు కోసం ‘ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా మంత్రాలు చదువుతూ వినాయకుడికి ప్రతి అంగానికి ధూపం చూపించాలి.