Hema Chendra : ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలపై పుకార్లను వార్తలు రూపంలో పెట్టడం ఫ్యాషన్ గా మారింది. ప్రస్తుతం శ్రావణి భార్గవి, హేమచంద్ర మీద కొన్ని పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది కాక ఇటీవల కాలంలో సీనియర్ హీరో నరేష్ హీరోయిన్ పవిత్ర లోకేష్ ల పైన కూడా పుకార్లు బాగానే హల్ చల్ చేశాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గా సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. అయితే దీనిపై నరేష్ గట్టిగానే క్లారిటీ ఇచ్చాడు అయినా కూడా ఈ పుకార్లు సెలబ్రేట్ మీద వస్తూనే ఉన్నాయి .
హేమచంద్ర, శ్రావణ భార్గవి వీళ్లిద్దరు మీద కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారు, బంధం తెగిపోతుంది అని ఏవేవో పుకార్లు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలపై గట్టిగానే వీళ్లిద్దరు క్లారిటీ ఇచ్చారు. మీకు తమాషాగా ఉందా ఎందుకు మా జీవితాలపై ఊరికే పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడమే మీకు పనా అని వీళ్ళిద్దరూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు.ఇకనైనా ఈ పుకార్లను మానండి మా జీవితాలు చాలా హ్యాపీగా సాగిపోతుంది మా ఇద్దరి బంధం గురించి మీకు తెలియదు.
Hema Chendra : తమ విడాకుల వార్తలపై క్లారిటీ.

మా ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నదో తెలుసుకున్న తర్వాతనే వార్తలు పెట్టండి. ఇలా ఎలా పడితే అలా ఇండస్ట్రీ వాళ్ళ మీద పుకార్లు పెట్టడం మానుకోండి. అని హేమచంద్ర శ్రావణ భార్గవి ఎవరికి వాళ్లే క్లారిటీ ఇచ్చారు. ఎవరి గురించైనా వార్తలు రాసేటప్పుడు కామెంట్ రూపంలో పెట్టేటప్పుడు వాళ్ల గురించి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతనే కామెంట్ చేయండి. అన్ని తెలుసుకున్న తర్వాత నే ఇలాంటి వార్తలు రాయండి అని గట్టిగ చెప్పాడు హేమచంద్ర.