Dharma-Sandehalu : ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళేటప్పుడు తల్లి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తీసుకెళుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమగా తమ కూతురు కి కావలసిన వస్తువులను పంపిస్తూ ఉంటారు. అయితే కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి అస్సలు తెచ్చుకోకూడదు అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా అందరూ ఆడవారు పుట్టింటి నుంచి బంగారం, వెండి కిరాణా సరుకులు, ఇంటిని అలంకరించుకునే సామాన్లు తీసుకెళ్తూ ఉంటారు. పుట్టింటి నుంచి తీసుకువెళ్లే ఆ వస్తువుల మీద చిన్నదైనా పెద్దదైన వారికి ఎంతో అభిమానం, ప్రేమ ఉంటాయి. అయితే పుట్టింటి నుంచి అత్తవారింటికి కొన్ని వస్తువులు తెచ్చేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు. చాలామందికి వీటి వల్ల చాలా నష్టాలు అశుభాలు జరుగుతాయి.
చాలామంది ఆడవాళ్లు తల్లి గారి ఇంట్లో పూజ సామాగ్రి కొత్తగా అందంగా ఖరీదైనదిగా కనిపిస్తే వాటినే వారి ఇంటికి తీసుకు వెళ్లిపోవాలని అనుకతీసుకు. అయితే పూజ సామాగ్రి ఎంత ఖరీదైన అయినా ఒకసారి పూజ గదిలో వినియోగించిన తరువాత పూజ సామాగ్రిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ కొత్తవి అయితే అత్తవారింటికి తీసుకు వెళ్ళవచ్చు. అలాగే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును పుట్టింటి నుంచి అత్తవారింటికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్లకూడదు. అలాగే చింతపండు, కుంకుడుకాయ, కొబ్బరికాయ, వంటకు ఉపయోగించే నూనెలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకు వెళ్ళకూడదు.
ఒకవేళ పుట్టింట్లో ఇవి పండుతున్నా వాటిని కొంత డబ్బు ఇచ్చి కొనుక్కొని అత్తింటికి తీసుకెళ్లాలి. కుంకుడుకాయ, చింతపండు అశుభకానికి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు. అలాగే ఇంట్లో ఉపయోగించిన కత్తులు, కత్తెరలు, కూరగాయలు పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు. ముఖ్యంగా కూరళ్లల్లో కాకరకాయ, మెంతికూర, మెంతులు వంటివి అస్సలు పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదు. అలాగే ఇల్లు శుభ్రపరిచే వస్తువులు చీపుర్లు, చాటలు కూడా అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. కాబట్టి తల్లిదండ్రులు ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి అని పండితులు చెబుతున్నారు