విజయ్ సాయి అమాయకపు చూపులతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. హీరోగా , హీరో ఫ్రెండ్ గా ఎన్నో రకాల పాత్రలో నటించి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. తన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంన్నాడు. అయితే విజయ్ సాయి 2006 లో నటి వనిత రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఒక పాప కూడా పుట్టింది. కానీ కొంతకాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. 2015లో ఇద్దరు విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2017లో విజయ్ సాయి తన గదిలో ఆత్మహత్య చేసుకుని తన చావుకి తన భార్య కారణమని చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పినట్లుగా అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.
ఇకపోతే వనిత రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమాయణం విడాకులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ …వాల్ పోస్టర్ మూవీలో విజయ్ కి జంటగా నటించాను. ఇక ఆ సినిమా షూటింగ్ లో ఇద్దరం ప్రేమించుకుంన్నాం. ఇక ఇంట్లో మా ప్రేమని ఒప్పుకోలేదు. ఒక రోజు శ్రీశైలం వెళ్ళగా అక్కడ కారులోనే నాకు పసుపు తాడుకట్టేసాడు. ఇక ఆ పసుపు తాడు ఎవరికి కనపడకుండా కొన్నాల పాటు నేను జాగ్రత్తగా కాపాడుకుంన్నా. కానీ ఒక సందర్భంలో మా అమ్మకి దొరికిపోయా. దీంతో మా అమ్మ తాలి తెంపేసి రచ్చ చేసింది. ఇంతదాకా వచ్చాక చేసేదేముందని ఇంట్లో నుండి డబ్బు బంగారం తీసుకొని విజయ్ దగ్గరికి వచ్చేసాను. అప్పుడు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంన్నాం . కానీ పెళ్లి తర్వాతనే అతను నిజ స్వరూపం నాకు మెల్లగా అర్థమైంది.
పెళ్లయిన 13 రోజులకి నన్ను కొట్టడం, తిట్టడం మొదలుపెట్టాడు. అలాగే నాకు సినీ అవకాశాలు వస్తే చేయకూడదని కండిషన్స్ పెట్టాడు. అంతేకాక మా ఇంటి నుండి డబ్బు తీసుకురమ్మని పదేపదే హింసించేవాడు. అలా అతని వేధింపులు భరించలేక చాలా ఆస్తిని ఇచ్చేశాను. ఇక విజయ్ వేదింపులు భరించలేక 2013లో విడాకులు దరఖాస్తు చేశాను. అయితే మాకు ఒక పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపని చూపించాలి అన్నారు. అలా నా కూతురు వారంలో ఒకసారి విజయ్ తో ఉండేది. అయితే విజయ్ ఏం చేసినా భరించాను కానీ నా స్థానంలో వేరొకరిని తీసుకురావడంతోనే నేను విడాకులు తీసుకున్నానని వనిత చెప్పుకొచ్చింది. ఇక ఈ ఒక్క విషయంలోనే నేను బాగా బాధపడ్డానని ఆ తర్వాత విజయ్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు కానీ అతను చనిపోయినప్పుడు ఎంతో ఏడ్చాను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికీ దీనికి సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నాయని తన కూతురి కోసం ఇప్పుడే తన కెరీర్ అని తిరిగి మొదలు పెడుతున్నానని చెప్పుకొచ్చింది వనిత రెడ్డి.