Astro Tips : భక్తులు దేవుడు ముందు దీపాన్ని వెలిగించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. కొందరు రాగి ప్రమిదలు, మట్టి ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు ఇలా రకరకాల ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పిండి దీపాలు కూడా వెలిగిస్తారు. దేవుడు సన్నిధిలో పిండి దీపం వెలిగియటం వెనక ఉన్న కారణమేమిటో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దీపం వెలిగించకుండా పూజ పూర్తి కాదని అంటారు. ప్రతి శుభ సందర్భంలో దీపం వెలిగిస్తారు. ప్రత్యేకమైన సందర్భంలో నాలుగు దీపాలు లేదా ఐదు ముఖాల దీపాలు కూడా వెలిగిస్తారు. ఇలా కాకుండా, దీపంలో ఒత్తి, నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఇందుకోసం మట్టి దీపం కానీ పిండి దీపం కూడా వెలిగిస్తారు. ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల శ్రేయస్సు, ఆనందం చిరకాలం వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం.
అగ్ని దేవుని సాక్షిగా ఈ పని మొదలుపెట్టిన సంపూర్ణంగా పూర్తవుతుందని నమ్ముతారు. మన శరీరం సృష్టికి కారణమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటని చెప్పవచ్చు. జ్యోతిని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. భక్తులు తమ ఇళ్లల్లో మట్టి, రాగి ప్రమిదలలో దీపారాధన చేస్తారు. కొన్ని సందర్భాలలో మట్టి దీపాన్ని కూడా వెలిగిస్తారు. దీని వెనక కారణమేముందంటే. జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇది జీవితంలో ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. ఇలా పిండి దీపం వెలిగించడం వల్ల మీకు ధనప్రాప్తి కచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు పిండి దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి పిండి దీపాన్ని వెలిగిస్తారు. ఇందుకోసం ఎల్లప్పుడూ పిండి దీపాల సంఖ్యను పెంచడం తగ్గించడం చేస్తుంటారు.
Astro Tips : దేవుడు సన్నిధిలో పిండితో దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసా.

11 రోజులు పిండి దీపాలు వెలిగిస్తే, మొదటిరోజు 11 దీపాలు, రెండవ రోజు 10 దీపాలు, మూడవరోజు ఒక దీపం మాత్రమే వెలిగించాలి. ఒక దీపంతో వెలిగించడం ప్రారంభించినట్లయితే చివరి రోజున 11 దీపాలను వెలిగించండి. ఇది కాకుండా మీ కోరిక ప్రకారం ఇష్ట దైవం ముందు దీపం వెలిగించండి.ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి పొందాలనుకునే వారు, సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ముందు తీర్మానం చేసి 11 రోజులు పాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించండి. దీని కారణంగా, కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితులు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. పసుపు కలిపిన పిండితో దీపం చేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, విష్ణు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. జాతకంలో రాహు కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే శని గ్రహ దోషాలు తొలగిపోతాయి