Guppedantha Manasu 13 October 2022 Episode : జగతికి కోసిరి కొసరి వడ్డిస్తున్న రిషి… అది చూసి మండిపడుతున్న దేవయాని….

Guppedantha Manasu 13 October 2022 Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది ఈరోజు ఎపిసోడ్ 580 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి బొమ్మలు చూసి సంతోషపడుతూ ఉంటాడు. అంతలో గౌతం ఆ బొమ్మలను చూసి భలే ఉన్నాయి బొమ్మలు ఒక్కసారి నాకు ఇవ్వరా నేను చూస్తాను అని అంటుండగా రిషి ఈ బొమ్మలు నావి నేను ఇవ్వను అని అంటూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ ఈ మధ్యన నువ్వు వింత వింతగా చేస్తున్నావ్ రా బాబు అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక అందరూ కూర్చొని భోజనానికి సిద్ధంగా ఉంటారు కానీ రిషి రాకపోయేసరికి దేవి అని రిషి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతూ ఉండగా వసుధార నేను కాల్ చేశాను మెసేజ్ పెట్టాను వస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. అంతలో రిషి అక్కడికి వచ్చి నన్ను ఎవరు పిలవడం లేదు ఏంటి అని అడుగుతూ ధరణి వడ్డిస్తుండగా వదిన మీరు ఈరోజు కూర్చోండి నేను వడ్డిస్తాను అని అందరికీ వడ్డిస్తూ జగతికి కొసిరికొసరి వడ్డిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అది చూస్తున్న దేవి అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక చివర్లో రిషి మహేంద్రని డాడ్ మేడంని పిక్నిక్ కి తీసుకెళ్లండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్తూ ఉంటాడు.

Advertisement

Guppedantha Manasu 13 October 2022 Episode : జగతికి కోసిరి కొసరి వడ్డిస్తున్న రిషి…

అప్పుడు అవును తీసుకెళ్తా అని మహేంద్ర అంటూ ఉంటాడు. రిషి డాడ్ మీ ఆనందమే నాకు కావాలి అంటూ బంధాలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలంటే కొన్ని ఒప్పందాలు పెట్టుకోకుండా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఇక భోజనం తర్వాత అందరూ కూర్చొని బొమ్మల కొలువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మల కొలువు విషయంలో ఋషి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే అందరూ చక్కగా రెడీ అయ్యి బొమ్మలు కొలువుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ బొమ్మల కొలువు గురించి ఒకటి అనుకుంటాడు కానీ రిషి అలా కాదురా పెద్దమ్మ చెప్తుంది నువ్వు విను అని అంటాడు అప్పుడు దేవయాని బొమ్మల కొలువు గురించి చెప్పబోతూ ఉండగా వసుధార చక్కగా రెడీ అయ్యి నేను చెప్తా అని మెట్లు దిగుకుంటా వస్తూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధ రాను అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వసుధార బొమ్మల కొలువు గురించి చెప్పబోతూ ఉండగా…

Advertisement
Guppedantha Manasu 13 October 2022 Episode
Guppedantha Manasu 13 October 2022 Episode

దేవయాని ఇప్పుడు మనం చేసేది అదే కదా ఇక చెప్పనక్కర్లేదు అని అనగానే సరే ఏర్పాట్లు చూడండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వసుధార ఈ బొమ్మల కి అలంకరణగా కొన్ని చీరలు కావాలి అని అడగగా దేవయాని ధరణి వెళ్లి తీసుకురా అని చెప్పగానే ధరణి వెళ్తూ ఉండగా వసుధార నేను తీసుకొస్తాను లేండి అని వసుధార వెళుతూ ఉంటుంది అప్పుడు రిషి నీకు తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళు వస్తారా అని అంటూ ఉంటాడు అప్పుడు వసుధార వెనక్కి వచ్చి రిషినే చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు జగతి మహేంద్ర గౌతమ్ వాళ్ళని చూసి సంతోష పడుతూ ఉంటారు. ఇక రిషి వసుధర పైన గదిలో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కింద దేవయాని అందరికీ పనులు చెబుతూ ఉంటుంది జగతిని నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని అడుగుతుంది అప్పుడు జగతి వద్దులేండి అక్కయ్య గారు మీరు అలా నిలబడండి మేము చేస్తాం అని చెప్తూ ఉంటుంది. మహేంద్ర దేవయానిని ఎటకారంగా కామెడీ చేస్తూ ఉంటాడు. జగతి గౌతమ్ నవ్వుతూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement